Suryapet : గోదావరి జలాలు విడుదల, రైతుల ఆనందోత్సవాలు..!
సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గ రైతులకు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ నీటితోనే ఈ యాసంగిసీజన్ పంటలు పండుతున్నాయి.

Suryapet : గోదావరి జలాలు విడుదల, రైతుల ఆనందోత్సవాలు..!
అర్వపల్లి/తుంగతుర్తి , మన సాక్షి:
సూర్యాపేట జిల్లా లోని తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గ రైతులకు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ నీటితోనే ఈ యాసంగిసీజన్ పంటలు పండుతున్నాయి. వారబందీ విధానంతో ఆదివారం రావలసిన నీళ్లు నాలుగు రోజుల తర్వాత ఈరోజు విడుదల చేశారు. వరి పంట పోట్ట దశలో ఉండడంతో, నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఉండడంతో రైతులు వేసిన పంటలు చేతికి వచ్చేంతవరకు కూడా నమ్మకం లేదు.
శ్రీరామ్ సాగర్ నీటి పై రైతులు అనేక ఆశలు పెట్టుకున్నామని జాజి రెడ్డి గూడానికి చెందిన యువరైతు నోముల నరేష్ యాదవ్ తెలిపారు. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి చివరిదశలో పొలాలు ఎండిపోతే రైతులకు భారీ నష్టం వస్తుందని తెలిపారు. మరో 25 రోజులపాటు నీటిని అందిస్తే రైతుల పొలాలు పంట దిగుబడి వస్తుందని అన్నారు. తెలంగాణ ప్రజలు ముఖ్యంగా సూర్యాపేట జిల్లా ప్రజలు ఈ నీటి పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామ్ సాగర్ నీళ్లు విడుదల చేయడంతో రైతులు పండుగ వాతావరణం నెలకొన్నట్లు తెలిపారు.
నాలుగోసారి వారబందు నీటిని విడుదల :
తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలోని పలు మండలాల మీదుగా . తిరుమలగిరి జాజిరెడ్డిగూడెం తుంగతుర్తి మీదుగా 69 డిబిఎం 70 డిబిఎం 71 డిబిఎం మెయిన్ కాలువల మీదుగా సాగునీరు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరాంసాగర్ జలాలను అధికారులు నాలుగు రోజులు లేట్ అయినప్పటికీ మంగళవారం సాయంత్రం రైతులకు శుభవార్త తెలిపింది.
వేసవి ఎండలు ముదురుతున్న సందర్భంగా ఏసంగి పొలాలు బావులు, బోర్ల కింద పొలాలు బాగా సేద్యం చేసినప్పటికీ ఇంకా కొంతమంది రైతులు బావులు బోర్లు లేని పేద రైతులు శ్రీరాంసాగర్ జలాల కోసం ఎదురుచూస్తున్న సందర్భంలో మా పొలాలు ఎండిపోతాయా అనే బాధతో రెండు రోజుల క్రితం నాగారం మండలంలో రైతులు నిరసన తెలిపినప్పటికీ ప్రభుత్వం సాగునీరును అందివ్వడానికి వారబందీల నీటిని అందిస్తున్నామని నీటిపారుదల జిల్లా అధికారులు తెలిపారు.
గత నాలుగు రోజులు లేట్ కావడానికి కారణం బయన్న వాగు పైన మెయిన్ కాలువ లో పశువులతో పాటు ఇద్దరు యువకులు కొట్టుకపోవడంతో వారిని రక్షించడానికి ఒక నాలుగు రోజులు పై ప్రాజెక్టు నుండి నీటిని రాకుండా ఆపి ఆ ఇద్దరు యువకులను రక్షించడానికి నీటిని బందు చేశామని అధికారులు తెలిపారు.
రైతులు ఎండలు బాగా పెరగడంతో బావులలో బోర్లలో జలలు తగ్గడంతో పొలాలు ఎండిపోతున్నాయని మాకు పెట్టుబడులు పెట్టి నష్టం జరుగుతున్నాయని వారి ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే నీటిపారుదల జిల్లా అధికారులు మేము వారం వారం వారబంధిలా నీటిని సరఫరా చేస్తామని మీకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటిని అందివ్వడానికి పై రిజర్వాయర్ల నుండి నీటిని రప్పిస్తున్నామని మీకు ఇది నాలుగోసారి వారబందుల నీటిని విడుదల చేస్తున్నాం అని తెలపడంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :
- District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు సిస్టర్లు సస్పెండ్..!
- Breaking : తీవ్ర విషాదం.. సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు..!
- Nalgonda : వైద్యం వికటించి వ్యక్తి మృతి.. ఆసుపత్రి ముందు కుటుంబ సభ్యుల ఆందోళన..!
- TG : రైతులకు భారీ శుభవార్త.. ఆ సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాలలో జమ..!









