Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
TOP STORIESBreaking Newsవిద్య

TG : తెలంగాణలో ఒంటి పూట బడులకు డేట్ ఫిక్స్.. ఉదయం 8 గంటలకే క్లాసులు ప్రారంభం..!

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 23వ తేదీన విద్యా సంవత్సరం ముగిసే వరకు కూడా ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

TG : తెలంగాణలో ఒంటి పూట బడులకు డేట్ ఫిక్స్.. ఉదయం 8 గంటలకే క్లాసులు ప్రారంభం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 23వ తేదీన విద్యా సంవత్సరం ముగిసే వరకు కూడా ఒంటి పూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.

ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. 12.30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డిస్తారు. ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ మేనేజ్మెంట్ పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్నందున పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో మార్పులు చేశారు. పరీక్షలు జరిగే రోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పాఠశాల పనిచేస్తుంది. పరీక్షలు లేని రోజుల్లో సాధారణ తరహాలోనే ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు.

MOST READ : 

మరిన్ని వార్తలు