Breaking NewsTOP STORIESజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్ర.. పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్..!

Suryapet : ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్ర.. పర్యాటక ప్రాంతంగా చేసేందుకు కృషి.. జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్..!

చివ్వెంల, మన సాక్షి:

ఉండ్రు గొండ గిరిదుర్గం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పేర్కొన్నారు. బుధవారం చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన నాని ఆయన పరిశీలించారు. దేవస్థాన కమిటీ జిల్లా కలెక్టర్ తెజస్ ను పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు .

అనంతరం కమిటి ఏర్పాటుచేసిన ఫోటో యగ్జిబిషన్ కలెక్టర్ పరీశిలించారు.లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం,ఇతర ఆలయాలు, కోనేరులు, కట్టడాలు, చారిత్రక ప్రాకారాలను కలెక్టర్ తేజస్ పరిశీలించారు.

పరిశీలిస్తున్న సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

ఉండ్రుగొండ గిరిదుర్గం చరిత్ర : 

సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయాన్ని పురాతన కాలం నుండి విష్ణుకుండునీలు, చోళులు, ఇక్ష్వాక్షులు, కాకతీయులు, రెడ్డి రాజులు, శ్రీకృష్ణదేవరాయలు బహుమనీ సుల్తానుల కాలంలో ఇక్కడ ప్రధాన నగరాలు పట్టణాలు వెల్లివిసిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రాంతం అంతా నిజాం సుల్తాను కాలంలో ధ్వంసమై శిధిల చరిత్రగా మిగిలిపోయింది.

ఏక చక్ర కోట చుట్టూ ఎనిమిది గుట్టలు వాటిని కలుపుతూ ఎత్తైన ప్రాకారాలు భారీ నిర్మాణాలు 16 కిలోమీటర్ల మేర మట్టి గోడలు 20 అడుగుల ఎత్తు రెండు అడుగుల వెడల్పుతో నిర్మాణాలు జరగగా రాజులు సామంతులు పరిపాలన నాయకులు నివసించే చోటు దుర్భేద్యమైన ప్రాకారాలు రాళ్లతో నిర్మించారు.

ఇక్కడి పాలకులు 8 గుట్టల పైన 13 దేవాలయాలు, 18 కాలభైరవ విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్టించి పూజించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. ఇక ప్రధాన దేవాలయం ఉండ్రుగొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం స్వయంభుగా వెలిసినట్లు చరిత్రకారుల అభిప్రాయం.

ఈ ఉండ్రుగొండ గిరిదుర్గం దురాజ్పల్లి, ఉండ్రుగొండ, ధర్మాపురం, ఇమాంపేట, మహమ్మదాపురం గ్రామాలను కలుపుతూ సుమారు 1000,1500 ఎకరాలలో గుట్టలు కొత్తదనాన్ని పరుచుకొని ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాల్సి ఉన్నప్పటికిని జాతీయ రహదారి నుంచి లోపటికి ఉండడం రవాణా సౌకర్యం లేకపోవడం, ఇక్కడి ప్రాంత విశిష్టతను పెద్దగా ప్రచారంలో ప్రత్యేక పోవడంతో ఉండ్రిగొండ గిరిదుర్గం అంత ప్రాచుర్యంలోకి రాలేదు.

ఈ కార్య్రమానికి ఆర్డిఓ వేణుమాధవ్ డిఎఫ్ఓ సతీష్ కుమార్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి ఏ రమేష్ కుమార్ చివ్వేంల తాసిల్దార్, ఉండ్రుగొండ పర్యాటక అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ప్రముఖ వైద్యులు ఆదూర్తి రామయ్య, కార్యదర్శి మహేశ్వరం రవిచంద్ర,

ఆలయ కమిటీ సభ్యులు చకిలం కృష్ణ కుమార్, కృష్ణ మోహన్, శ్రీరాములు, మురళి కృష్ణ; ప్రముఖులు జుట్టుకొండ సత్యనారాయణ, నాగవల్లి బ్రహ్మయ్య; కార్యకర్తలు వంగర భరద్వాజ, కట్టంగూరి సంతోష్, పల్స సైదులు, చకిలం హర్ష; ఉండ్రుగొండ గ్రామస్థులు, ధర్మాపురం, సైదాబసు గూడెం గ్రామస్థులు పాల్గొన్నారు.

MOST READ : 

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు