Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణరాజకీయంసూర్యాపేట జిల్లా
సూర్యాపేట : పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు..!
సూర్యాపేట : పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు..!
సూర్యాపేట , మన సాక్షి :
కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్ నేతలు బుజ్జగింపులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మల్లు రవి.. పటేల్ రమేష్ రెడ్డి ఇంటి వద్ద చర్చలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా పటేల్ రమేష్ రెడ్డి వర్గీయులు కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ALSO READ : మధు యాష్కి నివాసంలో సోదాలు.. హయత్ నగర్ లో ఉద్రిక్తత..!









