మధు యాష్కి నివాసంలో సోదాలు.. హయత్ నగర్ లో ఉద్రిక్తత..!

హైదరాబాదులోని హయత్ నగర్ లో పరిస్థితిలో నెలకొన్నాయి. ఆకస్మిత్తుగా హయత్ నగర్ లోని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కిగౌడ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు.

మధు యాష్కి నివాసంలో సోదాలు.. హయత్ నగర్ లో ఉద్రిక్తత..!

హైదరాబాద్ , మన సాక్షి :

హైదరాబాదులోని హయత్ నగర్ లో పరిస్థితిలో నెలకొన్నాయి. ఆకస్మిత్తుగా హయత్ నగర్ లోని ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కిగౌడ్ నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఒకసారిగా ఇంట్లో ప్రవేశించి తనిఖీలు నిర్వహించారు.

ఎలాంటి సెర్చ్ వారెంట్ కూడా లేకుండా పోలీసులు మధుయాష్కి నివాసంలో తనిఖీలు చేసేందుకు వచ్చారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మధుయాష్కి నివాసం వద్ద పెద్ద ఎత్తున డబ్బు ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేశారని తెలుస్తుంది .

ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మధుయాష్కి.. తనపై ఎవరైనా ఫిర్యాదు చేశారా..? లేక సెర్చ్ వారెంట్ ఏమైనా ఉందా..? చూపించండి అంటూ పోలీసులను నిలదీశారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ శ్రేణులు మధుయాష్కీ నివాసం వద్దు భారీగా తరలివచ్చి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ALSO READ : మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు.. బిఎల్ఆర్ సంచలన ప్రకటన.. సంపాదనలో 80 శాతం వారికి వెచ్చిస్తా..!