Suryapet : విజయాలలో టాప్ టెన్ లో నిలిచిన వికాస్ ఫార్మసీ..!
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 ఫార్మసీ కళాశాలలో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసోటికల్ సైన్సెస్ మొదటి పది స్థానాల్లో నిలిచి విజయాలని సాధించిందని మహారాష్ట్ర ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎంఎస్ సుధాకర్ బాబు అన్నారు.

Suryapet : విజయాలలో టాప్ టెన్ లో నిలిచిన వికాస్ ఫార్మసీ..!
సూర్యాపేట, మనసాక్షి :
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 120 ఫార్మసీ కళాశాలలో వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసోటికల్ సైన్సెస్ మొదటి పది స్థానాల్లో నిలిచి విజయాలని సాధించిందని మహారాష్ట్ర ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎంఎస్ సుధాకర్ బాబు అన్నారు. గురువారం రాయన్ గూడెం వికాస్ ఫార్మసీ కాలేజీలో నూతన విద్యార్థులకు స్వాగత పరిచయ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల నుంచి వేల కొలది విద్యార్థులు మంచి స్థానాల్లో స్థిరపడ్డారని అన్నారు. రాష్ట్ర ఫార్మసీ కళాశాలల సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ కే రామదాసు మాట్లాడుతూ గత 23 ఏళ్లుగా వికాస్ ఫార్మసీ కళాశాల ఎన్నో విజయాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచిందని అన్నారు.ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా జరిగే అనేక ఫార్మసీ సదస్సులకు ఉత్సవాలకు వికాస్ విద్యార్థులు హాజరవుతున్నారని అన్నారు.
కళాశాల కరస్పాండెంట్ సాదినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆశయాలకు తగినట్లుగా ఫార్మసీ కోసం కన్న కలల్ని విద్యార్థులు విజయవంతంగా ముందుకు తీసుకుని వెళుతున్నారని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ ఆడపు రమేష్ మాట్లాడుతూ వికాస్ ఫార్మసీ కళాశాల ఇటీవలే అమెరికాలోని నార్త్ కరోలినా యూనివర్సిటీ తో శిక్షణ ఒప్పంద కార్యక్రమాలను కుదుర్చుకుందని తెలిపారు
కార్యక్రమంలో వయసు ప్రిన్సిపల్ డాక్టర్ నీలమ్మ డాక్టర్ స్వరూప నటేష్ గుంటూరు నవీన్ కుమార్ డాక్టర్ నరసింహారావు దేవులపల్లి వినయ్ కుమార్ డాక్టర్ రమేష్ ఫర్ హిన్ మహేష్ సుజాత సమత భవాని రాజకుమార్, స్రవంతి ,పుష్పకుమారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో పరిచయ కార్యక్రమం సజావుగా సాగింది.విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అల్లరించాయి.









