పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
నాగిరెడ్డిపేట్, మన సాక్షి:
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని బొల్లారం గ్రామానికి చెందిన చాకలి రాములు,(41) అనే వ్యక్తి మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానిక ఎస్సై రాజు తెలిపారు. ఎస్సై తెలిపిన విరాల ప్రకారం..
బొల్లారం గ్రామానికి చెందిన చాకలి అలియాస్ ఎర్రోళ్ల లలిత అనే మహిళకు చాకలి రాములు గత కొన్ని సంవత్సరాల క్రితం చిన్న కొడప్ గల్ గ్రామం నుండి ఇల్లరికం వచ్చాడని లలిత, రాములు దంపతులకు ముగ్గురు కూతుర్లు గాయత్రి, గంగోత్రి , సంధ్య, అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారన్నారు.
ALSO READ : Revanth reddy : రేవంత్ రెడ్డి ఓ డైనమిక్ లీడర్.. ఆయన రాజకీయ ప్రస్థానం..!
కాగా రాములు ఈనెల మూడో తేదీన తన భార్యను మద్యం కోసం డబ్బులు అడగగా ఇవ్వకపోవడంతో ఇంటి నుండి వెళ్లి తిరిగి రాలేదని రాములు ఆచూకీ కోసం చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికిన ఆచూకీ దొరకలేదన్నారు. బుధవారం బొల్లారం గ్రామ శివారులోని కన్నయ్య కుంట వద్ద పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడని గ్రామస్తుల ద్వారా తెలిసిందన్నారు.
మృతుడు రాములు మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని భార్య చాకలి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజు తెలిపారు.
ALSO READ : రేవంత్ రెడ్డిది ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ.. ఆయన రాజకీయం టిఆర్ఎస్ తోనే ప్రారంభం.. సోషల్ మీడియాలో వైరల్..!









