Suspended : జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం.. నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం తెలిపారు.

Suspended : జిల్లా విద్యాశాఖ అధికారి సంచలన నిర్ణయం.. నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్..!
తుంగతుర్తి, మనసాక్షి :
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన నలుగురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి కె.అశోక్ శనివారం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బండరామారం జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో
జరిగిన పరిపాలనా పరమైన లోపాలు మరియు ఉపాధ్యాయుల మధ్య నెలకొన్న వివాదాల దృష్ట్యా పాఠశాల హెచ్ఎం ఎం.ఏ. హకీమ్ ను ఈనెల 15న సస్పెండ్ చేసినట్టు తెలిపారు. అలాగే శనివారం రోజున పాఠశాల ఉపాధ్యాయులైన పి. కోటయ్య, కె. సుజాత, జి. గీత, కె. శ్రీనివాస్ నాయుడు లను జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాడు తెలిపారు.
వీరు పాఠశాల వయస్సు గల పిల్లలు గ్రామంలో ఉన్నప్పటికీ, హైస్కూల్ విభాగంలో విద్యార్ధుల సంఖ్య సున్నాకు పడిపోవడంపై విచారణ జరపగా, ఉపాధ్యాయుల ప్రవర్తన సరిగా లేదని తేలింది అని అన్నారు.
సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మరియు పాఠశాల రికార్డులను సరిగా నిర్వహించకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విదారణ కొనసాగుతుందని తెలిపారు.