తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

Suryapet : రికార్డు స్థాయిలో దీక్ష స్వీకరించిన స్వాములు.. కిక్కిరిసిన శబరినగర్..!

Suryapet : రికార్డు స్థాయిలో దీక్ష స్వీకరించిన స్వాములు.. కిక్కిరిసిన శబరినగర్..!

సూర్యాపేట, మనసాక్షి :

కార్తీక మాసం మొదటి బుధవారం రోజున అయ్యప్ప దీక్ష స్వాములతో శబరి నగర్ అయ్యప్ప స్వామి దేవాలయం కిటకిటలాడింది. సూర్యాపేట పట్టణంతో పాటు పరిసర గ్రామాల భక్తులు భారీ ఎత్తున తరలివచ్చి దీక్షను స్వీకరించారు.

కార్తీక మాసం కంటే ముందు నుండే అయ్యప్ప స్వాములు దీక్షను స్వీకరించగా బుధవారం మంచి రోజు ఉండటం తో సెంటుమెంట్ గా ఒక్కరోజే రికార్డు స్థాయిలో 750 మంది స్వాములు దీక్షను స్వీకరించారు.

దీక్ష స్వాముల భజనలతో దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. దేవాలయం అర్చకులు రెంటాలా సతీష్ శర్మ అయ్యప్ప స్వామి మూల విరాట్ ను అన్ని రకాల పండ్ల తో ప్రత్యేకంగా అలంకరణ చేశారు. పట్టణం లో ఆధ్యాత్మికత శోభ సంతరిచ్చుకుంది.

MOST READ : 

మరిన్ని వార్తలు