సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

నడిగూడెం, సెప్టెంబర్ 21, మనసాక్షి : నడిగూడెం మండల కేంద్రంలో ఎస్సై ఏడుకొండలు ఆదేశానుసారం పోలీస్ సిబ్బంది వీరబాబు, సక్రు స్థానిక పెట్రోల్ బంక్ వద్ద బుధవారం వ్యవసాయ కూలి పనికి వెళ్లే వారికి మరియు వివిధ గ్రామాల నుండి వచ్చి పోయే ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం అని అన్నారు.

అనంతరం వ్యాపార సంస్థల నిర్వాహకులు, మీసేవ కేంద్రాల వారికి, ఇతరత్రా దుకాణదారులు ఆన్లైన్ లావాదేవీల విషయంలో కానీ, సోషల్ మీడియాలో వచ్చిన సందేశాల గురించి కానీ, ఫోన్ కాల్ ద్వారా లోన్ వస్తాయని గాని, మీ ఏటీఎం బ్లాక్ అయిందని చెప్పి వారు మనకు తెలియకుండానే మన ఖాతాలో డబ్బులు ఖాళీ చేస్తారని తెలియజేశారు. అదేవిధంగా ఇట్లాంటి మోసాలకు గురై చాలామంది లక్షలలో కోట్లలో డబ్బుని పోగొట్టుకున్నారని ఫోన్ల ద్వారా ల్యాప్ టాప్ ద్వారా అకౌంట్ ను హ్యాక్ చేయడమే కాకుండా ఆన్లైన్లో పరిచయాల ద్వారా లైంగిక వేధింపులు మోసాలు అధికంగా జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

నేరం జరిగిన వెంటనే బాధితులు ఫిర్యాదు చేయకపోవడం వల్లే సైబర్ నేరగాళ్లు చెలారేగిపోతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.