TOP STORIESBreaking Newsఉద్యోగంతెలంగాణనిజామాబాద్

Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!

Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!

ఆర్మూర్, మన సాక్షి :

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి ఎన్నో కుటుంబ భారాలు, పోరాటాలు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి గ్రూప్-1 పరీక్షలో అద్భుతమైన ర్యాంక్ సాధించింది. అటువంటి మహిళ ఎంతో కష్టపడి ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి)గా ఉద్యోగాన్ని సాధించడం ఆమె జీవిత విజయానికి నిలువెత్తు నిదర్శనం…

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలం కల్లేడీ గ్రామానికి చెందిన ఎండి, తాహేర బేగం, ఎంతగానో శ్రమించి మంచి చదువు ద్వారా గ్రామానికే పేరు తీసుకువచ్చారు. చిన్ననాటి నుంచే కుటుంబ పరిస్థితులు సవాళ్లను ఎదుర్కొని, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ విజయం వైపు ప్రయాణం సాగించారు.

తాహేర బేగం – శ్రమకు ప్రతిఫలం దక్కిందని చెప్పవచ్చు.ఎండి సలీం, సహేనా బేగం దంపతుల కుమార్తె తాహేర బేగం చదువు మీద ఆసక్తితో, గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసి త్రిబుల్ ఐటీ లో సీటు సాధించింది.

అక్కడ ఉన్నత చదువులు చదివి ఐబీపీఎస్ కోపరేటివ్ బ్యాంక్‌లో క్లర్కుగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడే ఆర్థికంగా కుటుంభానికి ఊరట కలిగించడమే కాకుండా, 2024లో గ్రూప్-4 పరీక్షలో రెవిన్యూ డిపార్ట్మెంట్‌లో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించారు.

ఈ బాధ్యతల మధ్య సమయం వెచ్చిస్తూ, తహేర బేగం గ్రూప్-1 పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యారు. ఉన్నత ర్యాంకుతో ఎంపీడీవో నౌకరిని దక్కించుకుంది. అంకితభావం, సాధన–ఇవి తాహేర బేగంను నియామక పట్టికలో 1053వ ర్యాంకుకు చేర్చాయి. గ్రూప్-1 ఎంపీడీవో ఉద్యోగం ఆమెకు లభించడంతో తన గ్రామానికి, కుటుంబానికి గర్వకారణం అయింది.

“నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించిన తల్లితండ్రులకు రుణపడి ఉంటాను.నాపై నమ్మకంతో నాకు మద్దతుగా ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామ పెద్దల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చాను” అని తాహేర్ బేగం తెలిపింది.అనుభవాలకు ప్రభావంఅరువైన పరిస్థితుల్ని, కష్టాలను అధిగమించి విజయం సాధించడం ద్వారా గ్రామ యువతలో కొత్త ఆశను నింపారు.

నిరుపేద కుటుంబం నుంచి ప్రభుత్వ ఉద్యోగం వరకు ప్రయాణం అందరికీ ఆదర్శం,ప్రోత్సాహాన్ని కలిగిస్తోంది. గ్రామానికి ఉన్నత గౌరవాన్ని తీసుకువచ్చిన ఆమెకు గ్రామ ప్రజలు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

MOST READ : 

  1. Health Officer : రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినిగా లలితాదేవి..!

  2. Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!

  3. Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!

  4. Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!

మరిన్ని వార్తలు