గొడకొండ్ల లో 24 న తైబజార్ వేలం.. ఇవీ నిబందనలు..!
చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామపంచాయతీ పరిధిలో గల వివిధ వ్యాపార ఆదాయ వనరులకు సంబంధించిన తై బజార్ కాంట్రాక్టర్ ను ఈనెల 24న వేలం ద్వారా కేటాయించనున్నట్లు గొడవ కొండ్ల గ్రామపంచాయతీ కార్యదర్శి మురళీమోహన్ పేర్కొన్నారు.

గొడకొండ్ల లో 24 న తైబజార్ వేలం.. ఇవీ నిబందనలు..!
చింతపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని గొడకొండ్ల గ్రామపంచాయతీ పరిధిలో గల వివిధ వ్యాపార ఆదాయ వనరులకు సంబంధించిన తై బజార్ కాంట్రాక్టర్ ను ఈనెల 24న వేలం ద్వారా కేటాయించనున్నట్లు గొడవ కొండ్ల గ్రామపంచాయతీ కార్యదర్శి మురళీమోహన్ పేర్కొన్నారు.
ఈ వేలం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. వేలంలో పాల్గొనదలచిన కాంట్రాక్టర్లు అదే రోజు కనీసం ఒక గంట ముందుగా వచ్చి నిర్దేశించిన నిర్దేశించిన డిపాజిట్ ను చెల్లించాలన్నారు. గ్రామ పంచాయతీ నిబంధనను పాటిస్తూ, ఈ కాంట్రాక్ట్ గడువు 2026 ఏప్రిల్ 1 నుండి, 2027 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని వారు పేర్కొన్నారు.
వేలంలో పాల్గొనదలచిన వ్యక్తి కి గ్రామ పంచాయతీలో ఎలాంటి పనులు బకాయి లేకుండా చూసుకోవాలన్నారు. ఒకవేళ ఉన్నట్లయితే బకాయిలు పూర్తిగా చెల్లించిన తదుపరి ఈ వేలానికి అర్హులవుతారు అన్నారు. పూర్తి వివరాలు కోసం గ్రామపంచాయతీ కార్యదర్శిని సంప్రదించాలని వారు కోరారు.









