క్రైంBreaking Newsజగిత్యాల జిల్లాజిల్లా వార్తలుతెలంగాణ

Aadhar Card : ఆధార్ కార్డు ట్యాంపరింగ్.. కొత్త తరహాలో సైబర్ మోసం..!

Aadhar Card : ఆధార్ కార్డు ట్యాంపరింగ్.. కొత్త తరహాలో సైబర్ మోసం..!

జగిత్యాల, మన సాక్షి:

ఆధార్ కార్డును ట్యాంపరింగ్ చేసిన సైబర్ నేరగాళ్లు కొత్త తరహాలో మోసానికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన మంజుల నారాయణ కల్లుగీత వృత్తిని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

పంట రుణం అవసరమై అతడు ఇటీవల పట్టాదారు పాసుబుక్ తీసుకొని కెనరా బ్యాంక్ కు వెళ్లాడు. ఆ బ్యాంకు వాళ్లు మొదట్లో రుణం ఇచ్చేందుకు అంగీకరించారు. కానీ సిబిల్ స్కోర్ ను పరిశీలించగా హైదరాబాదులోని వివిధ బ్యాంకులలో సుమారు 20 లక్షల రూపాయల బ్యాంకు రుణాలను ఉన్నట్లు వెల్లడైంది. కిస్తీలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల సిబిల్ స్కోర్ పడిపోయిందని రుణం ఇవ్వబోమని బ్యాంక్ అధికారులు చెప్పారు. తాను ఏ బ్యాంకులకు వెళ్లి ఇప్పటి వరకు రుణం తీసుకోలేదని, తనకు తెలియకుండానే రుణం ఎలా తీసుకుంటారని అడగడంతో బ్యాంక్ అధికారులు డాక్యుమెంట్లను తీసి ఇచ్చారు.

ఈ విషయాన్ని నారాయణ బుగ్గారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలని వారు సూచించారు. నారాయణ సైబర్ క్రైమ్ అధికారులను సంప్రదించగా సరైన స్పందన రాలేదు. దాంతో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు ప్రజావాణిలో వివరించారు.

బ్యాంకు అధికారులు తనకు ఇచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా డాక్యుమెంట్లలో తన ఆధార్ కార్డు ఉందని, పాన్ కార్డు, అడ్రస్ మాత్రం వేరే వ్యక్తిది ఉందని నారాయణ పేర్కొన్నాడు. రుణం నెలవారీగా కిస్తీలు చెల్లించాలంటూ హైదరాబాదులోని బ్యాంకులో నుంచి తనకు ఫోన్లు వస్తున్నట్లు నారాయణ పేర్కొన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. ఇదిలా ఉండగా ఈ విషయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులకు పంపించాడు.

LATEST UPDATE :

మరిన్ని వార్తలు