Breaking Newsఉద్యోగంజిల్లా వార్తలుసంగారెడ్డి జిల్లాహైదరాబాద్
గడ్డపోతారం నూతన కమిషనర్ గా తాన్య.. ఎవరో తెలుసా..!
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పురపాలక సంఘ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్‌గా పీ. తాన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు.

గడ్డపోతారం నూతన కమిషనర్ గా తాన్య.. ఎవరో తెలుసా..!
పటాన్చెరు, (మనసాక్షి):
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పురపాలక సంఘ కార్యాలయంలో నూతన మున్సిపల్ కమిషనర్‌గా పీ. తాన్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం కమిషనర్ పీ. తాన్య మాట్లాడుతూ… పట్టణ అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు మెరుగైన మున్సిపల్ సేవల అందజేతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.









