తెలంగాణBreaking Newsక్రీడలుజిల్లా వార్తలురంగారెడ్డి

Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

Pro Kabaddi : ప్రో కబడ్డీ లీగ్ సీజన్-12కు ఎంపికైన టీచర్.. ఎవరో తెలుసా..!

శంకర్‌పల్లి, మన సాక్షి:

ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 టెక్నికల్ అఫీషియల్ గా చిర్మని శ్వేతా సత్యశివారెడ్డి ఎంపికయ్యారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని చన్ వెల్లి గ్రామానికి చెందిన శ్వేతా సత్య శివారెడ్డి ప్రస్తుతం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డాన్ బాస్కో పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూన్నారు.

ఇటీవల ఢిల్లీలో ఏకెఎఫ్ఎ నిర్వహించిన శిక్షణ శిబిరంలో తెలంగాణ తరఫున పాల్గొని అర్హత సాధించారు. ఇలా దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రో కబడ్డీ లీగ్ పోటీల కోసం టెక్నికల్ అఫీషియల్ గా ఎంపికైన 44 మందిలో శ్వేతారెడ్డి ఒకరు.

ఆనంతరం హైదరాబాద్‌లోని బాచుపల్లిలో కాసాని కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుండి 20 వరకు సీజన్ 12 కోసం నిర్వహించిన టెక్నికల్ అధికారుల ఆన్లైన్, ఆన్లైన్ శిక్షణ పూర్తి చేసుకున్నారు.

భారతదేశంలో ఇటీవల ఆదరణ పొందుతున్న ప్రో కబడ్డీ సీజన్ 12 పోటీలు ఆగస్టు 29 నుండి అక్టోబర్ 23 వరకు వైజాగ్, జైపూర్, చెన్నై, ఢిల్లీలో సాగనున్నాయి.

అయితే జైపూర్ లోని ఇండియా హాల్ ఎస్ఎంఎస్ స్టేడియంలో సెప్టెంబర్ 12 నుండి 27 వరకు సాగే సీజన్ 12 ప్రో కబడ్డీ లీగ్ పోటీలకు టెక్నికల్ ఆఫీషియల్ గా శ్వేతారెడ్డి విధులను నిర్వహించనున్నారు. తనకు సహకరించి ప్రోత్సహించిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

MOST READ : 

  1. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన అవినీతి అధికారి..!

  2. Nalgonda : 24 గంటల్లో హత్య కేసు నిందితుడి అరెస్టు.. నల్లగొండ ఘటనలో సంచలన విషయాలు..!

  3. Nacharam : ముంబై నుండి తెప్పించిన సిద్ధి వినాయకుడి విగ్రహం.. ఘనంగా పూజలు..!

  4. Health : ఆరోగ్య సేవల్లో సరికొత్త అధ్యాయం.. ఐఐహెచ్ హెల్త్‌కేర్ ‘కేర్. ఫర్ గుడ్’ బ్రాండ్..!

  5. Tamarind : చింతపండుతో ఆరోగ్యమేనా.. తెలుసుకోండి..! 

మరిన్ని వార్తలు