Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

ఆయిదేళ్లుగా స్టూడెంట్‌తో టీచర్ ప్రేమ.. తన భర్త తనకు కావాలంటూ భార్య ఆవేదన..!

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టొన్ కు చెందిన మధులత తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్మూర్ పట్టణ ప్రెస్‌క్లబ్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ కష్టాలను వివరించారు.

ఆయిదేళ్లుగా స్టూడెంట్‌తో టీచర్ ప్రేమ.. తన భర్త తనకు కావాలంటూ భార్య ఆవేదన..!

ఆర్మూర్, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ టొన్ కు చెందిన మధులత తన భర్త అక్రమ సంబంధం పెట్టుకుని రెండో వివాహం చేసుకున్నాడని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె ఆర్మూర్ పట్టణ ప్రెస్‌క్లబ్‌ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమ కష్టాలను వివరించారు. కాశీపాక మధులతతో మదనం రాములు మూడు సంవత్సరాల పాటు ప్రేమించి,సుమారు 20 ఏళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకున్నాడు.

ఇద్దరు పిల్లలు అమ్మాయి (19) అబ్బాయి (15) ఉన్నారు.ఇదిలా ఉండగా మధనం రాములు సికింద్రాపూర్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ ఉండేవాడు.అయితే అక్కడ చదువుతున్న ఒక విద్యార్థినితో గత ఐదేళ్లుగా ప్రేమ సంబంధం పెట్టుకుని, తనపై మానసికంగా, శారీరకంగా వేధింపులు జరిపేవాడని మధులత ఆరోపించారు.

విద్యార్థినినే పెళ్లి చేసుకుంటానని తరచూ తనతో తగాదాలు పెట్టుకుంటూ వచ్చాడని ఆమె తెలిపారు. ఇటీవలి వారం రోజులుగా తరచు గొడవలు పెట్టుకుని, చివరకు ఆ విద్యార్థినితో కలిసి ఇంటిని విడిచి వెళ్లిపోయాడని చెప్పారు. వెళ్లే ముందు ఇంట్లో ఉన్న బంగారు నగలు, ఆస్తి పత్రాలు, నగదు మొత్తం తీసుకుపోయాడని మధులత వెల్లడించారు. దీనివల్ల తాను, తన పిల్లలు పూర్తిగా రక్షణలేని స్థితిలో మిగిలిపోయామని కన్నీటి పర్యంతమయ్యారు.

ఈ విషయమై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అయినా ఇప్పటివరకు సరైన చర్యలు తీసుకోలేదని, అధికారులు జోక్యం చేసుకుని తన భర్తను తమ వద్దకు రప్పించేలా చర్యలు తీసుకోవాలని మధులత వేడుకున్నారు.

MOST READ NEWS 

మరిన్ని వార్తలు