Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణవరంగల్ గ్రామీణ జిల్లావరంగల్ పట్టణ జిల్లా
TG News : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్..!

TG News : తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు గాదె ఇన్నయ్య అరెస్ట్..!
మన సాక్షి, వెబ్ డెస్క్ :
తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు, సామాజిక కార్యకర్త గాదె ఇన్నారెడ్డి (ఇన్నయ్య) ను ఆదివారం ఎన్ ఐ ఏ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గడ్ లోని తన ఇంటి వద్ద అతనిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి ఎన్ఐఏ అధికారులు హైదరాబాద్ కు తరలించారు. మావోయిస్టుల తో సంబంధాలు ఉన్నాయని కారణంతో ఇన్నయ్యను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతు తెలుపుతున్నారని, ఇటీవల కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలలో పాల్గొని అక్కడి సమూహాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఎన్ ఐ ఏ పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా ఇన్నయ్య టీవీ చర్చ వేదిక కార్యక్రమాలలో పాల్గొని రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణ చేస్తారు.









