Breaking NewsTOP STORIESతెలంగాణరాజకీయం

Telangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

Telangana : ఆడబిడ్డలను అవమానిస్తారా.., అన్ ఫిట్ సీఎం, రేవంత్ పై కేటీఆర్ ఫైర్..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఆడబిడ్డలనే అంటావా.. అంటూ వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆయన డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబిత ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

దాంతో తెలంగాణలో పొలిటికల్ దుమారం లేచింది. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహిళా సభ్యుల పైన అకారణంగా రేవంత్ రెడ్డి నోరు పారేసుకున్నారని, అక్కలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని ముఖ్యమంత్రి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ అవమానం కేవలం సబితక్క, సునితక్కకు జరిగింది కాదు.. యావత్ తెలంగాణ ఆడబిడ్డలందరికీ అవమానం జరిగిందన్నారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం సరైనది కాదని, ఆయన ముఖ్యమంత్రి అన్ ఫిట్ అని, నోరు జారితే వెనక్కు తీసుకోవాలి కానీ ఖండ కావడంతో ఆడబిడ్డలను అవమానించారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు తప్పకుండా తగులుతుందని కేటీఆర్ ఫైర్ అయ్యారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న ఏ ఒక్క రోజైనా ఆడబిడ్డలను అవమానించామా..? ముఖ్యమంత్రిని ఏకవచనంతో మాట్లాడామని అభ్యంతరం చెప్తే వెంటనే మార్చుకున్నాం.

అది మాకు కేసీఆర్ నేర్పిన సంస్కారం. ఈరోజు మా ఆడబిడ్డలను జరిగిన అవమానం యావత్ తెలంగాణ బిడ్డలకు జరిగిన అవమానంగా భావిస్తున్నాం.. ముఖ్యమంత్రి సిగ్గు, బుద్ధి, జ్ఞానం తెచ్చుకుని సంస్కరించుకో.. ఇకనైనా ముఖ్యమంత్రి సమయం ఎంతో వివరించుకుంటే ఊరుకునేది లేదని, ఆడబిడ్డలను అడ్డగోలుగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు.

ALSO READ : 

Srisailam : కృష్ణమ్మ పరవళ్ళు.. శ్రీశైలంకు 3.26 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. Latest Update

రైతులకు రుణమాఫీ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలి.. అదనపు కలెక్టర్ ఆదేశం..!

Cm Revanth Reddy : విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి భారీ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా అమలు..!

మరిన్ని వార్తలు