ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా.. అంటూ రైతును ప్రశ్నించిన తాసిల్దార్.. సస్పెండ్..!
వ్యవసాయ భూమి సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ తాసిల్దార్ ను ఓ రైతు కలిసేందుకు వెళ్లగా ఆ తహసిల్దార్ రైతును ఎగతాళి చేశాడు. బాధ్యతారాహిత్యంగా నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా..? అంటూ ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా.. అంటూ రైతును ప్రశ్నించిన తాసిల్దార్.. సస్పెండ్..!
మన సాక్షి, వెబ్ డేస్క్ :
వ్యవసాయ భూమి సమస్యపై న్యాయం చేయాలని కోరుతూ తాసిల్దార్ ను ఓ రైతు కలిసేందుకు వెళ్లగా ఆ తహసిల్దార్ రైతును ఎగతాళి చేశాడు. బాధ్యతారాహిత్యంగా నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా.. బతికే ఉన్నావా..? అంటూ ప్రశ్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనకు స్పందించిన సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తాసిల్దార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల తాసిల్దార్ స్వామిని ఓ రైతు తన సమస్యపై కలిసేందుకు గజ్వేల్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ తన అభ్యర్థనను రైతుకు తాసిల్దార్ కు చెప్పుకోవడానికి వెళ్లగా భరోసా ఇవ్వాల్సిన తాసిల్దార్ అవమానించినట్లుగా మాట్లాడారు.
ఏ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా అయ్యింది. నువ్వు ఇంకా పురుగుల మందు తాగలేదా..? బతికే ఉన్నావా.. అంటూ రైతును తాసిల్దార్ ప్రశ్నించినట్లుగా వీడియో వైరల్ అయింది. తన తీవ్రమైన పరిస్థితిని చూసి నవ్వుతారా అని ఆ రైతు కంటతడి పెట్టుకుంటుండగా అవును నవ్వొస్తుంది.. బరాబర్ వస్తది అని ఆ అధికారి ఏ మాత్రం బాధ్యత లేకుండా సమాధానం ఇచ్చారు.
ఈ విషయంపై సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జిల్లా కలెక్టర్ హైమావతి విచారణకు ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీవో సమర్పించిన ప్రాథమిక నివేదికలో తాసిల్దార్ ప్రవర్తన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లుగా తేలడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్ విడిచి వెళ్లరాదని కూడా ఆదేశించారు.









