TOP STORIESBreaking Newsహైదరాబాద్

TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

TG News : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ శుభవార్త..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ భారీ శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ డియర్ నెస్ అలవెన్స్ (DA) విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయంపై ఇప్పటికే ఆర్థిక శాఖ సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన ఇతర బకాయిల చెల్లింపులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాల విడుదలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ఆరోగ్య బీమా పథకాన్ని జూన్ 2వ తేదీ నుంచి తీసుకురావాలని సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమిటీ సభ్యులు అనేకసార్లు ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశమై వారి అభ్యర్థనలు స్వీకరించారు. ఉద్యోగుల ముఖ్యమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కమిటీ ఉద్యోగుల సమస్యల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నివేదిక అందజేయనున్నది.

MOST READ : 

  1. Seeds : నకిలీ విత్తనాలను గుర్తించడం ఎలా.. విత్తనాలు కొనే ముందు రైతులు ఏం చేయాలి..!

  2. PDS : అక్రమంగా తరలిస్తున్న 97 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యం పట్టివేత..!

  3. Gurukula : గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం..!

  4. Ration Cards : కొత్త రేషన్ కార్డుల పంపిణీకి డేట్ ఫిక్స్.. ఫోన్ కు మెసేజ్ కూడా.. ఎప్పుడంటే..!

మరిన్ని వార్తలు