TOP STORIESBreaking Newsతెలంగాణసంక్షేమం

TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త తెలియజేశారు. ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని శాఖల సిబ్బందికి ఒక కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

TG News : ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శుభవార్త తెలియజేశారు. ప్రతి ఉద్యోగి భద్రతకు భరోసా కల్పిస్తూ అన్ని శాఖల సిబ్బందికి ఒక కోటి రూపాయల విలువైన ప్రమాద బీమా కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో సింగరేణి, విద్యుత్ శాఖ కార్మికులతో ప్రారంభమైన ఈ బీమా పథకం రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలకు వర్తింపజేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

ఉద్యోగుల హక్కులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం సింగరేణి, డిస్కంలో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలలో పనిచేసే ఉద్యోగుల భవిష్యత్తులో భీమ వర్తింప చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు చెప్పారు. కేవలం బీమా సదుపాయం మాత్రమే కాకుండా ఆరోగ్య సంరక్షణ పై కూడా ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెప్పారు.

సింగరేణి కార్మికులకు సంబంధించి గోదావరిఖనిలో అత్యంత ఆధునికమైన క్యాత్ ల్యాబ్ ను మరో 75 రోజుల్లో ప్రారంభించినట్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇది గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

MOST READ: 

  1. Doctorate : మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సతీష్ కు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్..!

  2. Nalgonda : విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కరించడానికి కృషి.. INTUC జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి..!

  3. District collector : మార్క్ ఫెడ్ ఎరువుల గోదామును ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. ఎరువుల యాప్ పై ఆరా..!

  4. Hyderabad : డయల్–100కు క్షణాల్లో స్పందించిన పోలీసులు.. ఏటీఎం దొంగ అరెస్ట్..!

మరిన్ని వార్తలు