Breaking Newsతెలంగాణసంక్షేమం

TG News : రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాలలో రూ. 6వేలు..!

TG News : రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. బ్యాంకు ఖాతాలలో రూ. 6వేలు..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

రైతు కూలీలకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలియజేసింది. భూమిలేని రైతు కూలీలను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందజేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోనున్నది. భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

ఆయన ఖమ్మంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొని వివరాలను వెల్లడించారు. భూమి భూమిలేని నిరుపేదలకు ఈనెల 28 (డిసెంబర్) లోనే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతు కూలీలకు ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నారు. ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం అందజేయడానికి సిద్ధం కాగా మొదటి విడతగా 6000 రూపాయలను రైతు కూలీల ఖాతాలో జమ కానున్నాయి.

అయితే సర్వే ఎలా జరిగింది?

రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న కుల గణన సర్వే ఇంకా పూర్తి కాలేదు. దాంతోపాటు ప్రజాపాలన ద్వారా దరఖాస్తుల స్వీకరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఏ విధంగా సర్వే జరిగిందనే విషయం ప్రభుత్వం పూర్తి వివరాలు ఇంకా వెల్లడించలేదు. కానీ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది రైతు కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల చొప్పున మొదటి విడతగా డిసెంబర్ 28వ తేదీన వారి వారి ఖాతాలలో జమ కానున్నాయి.

MOST READ : 

మరిన్ని వార్తలు