TOP STORIESBreaking News

TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

TG News : పింఛన్ దారులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే న్యూస్.. త్వరలో అర్హుల ఎంపిక..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుంది. సంక్షేమ పథకాల అమలుతో పాటు కొత్త సంక్షేమ పథకాలను కూడా ప్రారంభిస్తుంది. జనవరి 26వ తేదీన నాలుగు సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించనున్నారు. అదే విధంగా కొత్త పింఛన్ దారులకు కూడా ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది. త్వరలో అర్హులను ఎంపిక చేయనున్నట్లు తెలియజేసింది.

కొత్త పింఛన్ దారుల ఎంపికకు ఇప్పటికే కసరత్తులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 10 లక్షల మంది ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు వారిలో అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ పై ప్రభుత్వం దృష్టి సారించింది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 11 రకాల ఆసరా పింఛన్లను 42 లక్షల మందికి అందజేస్తుంది.

కాగా కొత్త పింఛన్ల ఎంపిక చాలాకాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ అర్హులను ఎంపిక చేయడంలో ఆలస్యమైంది. కాగా ప్రభుత్వం వాటిపై దృష్టి సారించింది. బడ్జెట్ సమావేశాలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కొత్తగా అర్హత సాధించే ఆసరా పింఛన్లను ఎంపిక చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు.

బడ్జెట్ లోపే ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి కొత్త పింఛన్లను అందజేయాలని ఆ శాఖకు ఆదేశాలు పంపనున్నారు. బడ్జెట్ లో కొత్త పింఛన్ దారులకు కూడా నిధులు కేటాయించనున్నారు. కాగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త పింఛన్ దారులకు త్వరలో మోక్షం కలగనున్నది.

MOST READ : 

  1. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

  2. Rythu Runamafi : రైతులకు భారీ గుడ్ న్యూస్.. రుణమాఫీ పై పొన్నం కీలక ప్రకటన..!

  3. Rythu Bharosa : రైతు భరోసా దరఖాస్తులకు ఇదే చివరి తేదీ.. లేటెస్ట్ అప్డేట్..!

  4. IBomma : ఐ బొమ్మలో కొత్త సినిమాలు.. ఫ్రీగా చూడొచ్చు.. అసలు మిస్ కావొద్దు..!

  5. Gold Price : పసిడి ప్రియులకు భారీ షాక్.. హైదరాబాదులో తులం ఎంతంటే..!

మరిన్ని వార్తలు