Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలునల్గొండ

Miryalaguda : గడువు తేదీ ముగిసిన పురుగు మందులు విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయధికారుల హెచ్చరిక..!

మిర్యాలగూడ మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడీఏ కొనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని పాల్గొన్నారు.

Miryalaguda : గడువు తేదీ ముగిసిన పురుగు మందులు విక్రయిస్తే చర్యలు.. వ్యవసాయధికారుల హెచ్చరిక..!

మిర్యాలగూడ, మన సాక్షి :

మిర్యాలగూడ మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో వ్యవసాయ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏడీఏ కొనిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో మండల వ్యవసాయ అధికారి రుషేంద్రమని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతుమిత్ర ఫెర్టిలైజర్స్, వెంకటరమణ, లక్ష్మీ సాయినాథ్ ఫెర్టిలైజర్స్, విశ్వామిత్ర తదితర ఎరువులు, పురుగు మందుల దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. దుకాణాల్లోని ఎరువులు, పురుగు మందుల నిల్వలు, లైసెన్సులు, కొనుగోలు–విక్రయ రికార్డులు, బిల్లులు, గడువు తేదీలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో ముక్కరమూర్తి, నామిరెడ్డి అశోక్ రెడ్డి, హరిబాబు తదితరులు, సంబంధిత ఎరువులు, పురుగు మందుల డీలర్లు పాల్గొన్నారు.

గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) ఎరువులు, పురుగు మందులను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించరాదని డీలర్లను అధికారులు హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే ఎరువులు, పురుగు మందులను విక్రయించాలని సూచించారు.

ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయించినా, నకిలీ లేదా గడువు ముగిసిన ఎరువులు, పురుగు మందులను విక్రయించినా సంబంధిత డీలర్లపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు