Breaking NewsTOP STORIEStravelజిల్లా వార్తలునల్గొండ

TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!

TGSRTC : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్.. వారందరికీ చార్జీల తగ్గింపు..!

దేవరకొండ, మనసాక్షి :

ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త తెలియజేసింది. అద్దె ప్రాతిపదికన తీసుకున్న ఆర్టీసీ బస్సులకు చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించినట్టు దేవరకొండ డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పల్లె వెలుగు కిలోమీటర్లకు 11 రూ,,ఎక్స్ ప్రెస్ 7 రూ, డీలక్స్ 8 రూ, సూపర్ లగ్జరీ 6రూ మేర తగ్గించినట్లు పేర్కొన్నారు.

శబరిమలకు, శుభ ముహూర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను తీసుకొని క్షేమంగా గమ్యాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా కార్తీకమాసంలో ప్రతి సోమవారం ఒకేరోజు పంచారామ దర్శనాల కొరకు ప్రతి ఆదివారం రాత్రి దేవరకొండ డిపో నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక డీలక్స్ బస్సులు సద్వినియోగం చేసుకోవాలని భక్తులను కోరారు.

అదేవిధంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరిప్రదక్షిణ కొరకు నవంబర్ 13 నాడు సూపర్ లగ్జరీ బస్సు బయలుదేరి, 14తేదిన కాణిపాక దర్శనం మరియు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శించుకుని,15వతేదిన అరుణాచల గిరిప్రదక్షిణ దర్శనం పూర్తి చేసుకుని 16 న ఉదయం దేవరకొండ డిపో కు చేరుకుంటుందని తెలిపారు .

టికెట్టు ఛార్జి, మరిన్ని వివరాలకు 7382833031,9666599890, 8790155040, 9848847419, 9959787725 లను సంప్రదించగలరు.

MOST READ : 

మరిన్ని వార్తలు