Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు..!

Miryalaguda : సీఎం రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు..!

మిర్యాలగూడ, మన సాక్షి:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన బీసీ గర్జనలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే తరహాలో మిర్యాలగూడ నియోజకవర్గంలో కూడా చివరి ఓసి ఎమ్మెల్యే బిఎల్ఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు.

సభలో ఆయన మాట్లాడుతూ దామరచర్ల మండలంలో డిప్యూటీ సిఎం, మంత్రుల కార్యక్రమం పెట్టింది బిసి గర్జనను విఫలం చేయడానికేనన్నారు. తీన్మార్ మల్లన్న పని తనం నచ్చకుంటే వెంటనే రాజీనామా
చేస్తా. పని తనం మంచిగా లేదంటే ఈ క్షణం రాజీనామా చేస్తానన్నారు.

పిడికెడు మంది లేనోల్లు ఓసి ఎమ్మెల్యేలను రాజకీయ సమాధి చేస్తాను. బిసి గుర్రాలు జాడించి కొడితే గల్లంతు అవుతారన్నారు. తమిళనాడు అసెంబ్లీలో 8 మంది ఓసిలు, మిగిలిన వారంతా బిసిలే ఉన్నారన్నారు, ఆ పరిస్థితి తెలంగాణలో రావాలన్నారు.

విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. 119 సభలు పెడతామన్నారు. ఉద్యోగులు, ఉపాద్యాయులు, కార్మికులకు బిసిలు అండగా ఉంటారన్నారు. నరేంద్ర మోడీ కులగణన చేస్తారా కుర్చీ వదులుకుంటారా లేదా అని ప్రశ్నించారు.

సభకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మడపైన అర్జున్ అధ్యక్షత వహించగా శాసనమండలి మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజి ఎమ్మెల్సీ పూల రవీందర్, ఆకుల లలిత, చెరుకు సుధాకర్, వట్టే జానయ్యయాదవ్, పిల్లి రామరాజు యాదవ్, పెద్ది శ్రీనివాస్ గౌడ్, కోల సైదులు, మారం శ్రీనివాస్, ఎ.నాగార్జున చారి పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు