Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Nalgonda : బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బిజెపి వర్సెస్ కాంగ్రెస్..!

Nalgonda : బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత.. బిజెపి వర్సెస్ కాంగ్రెస్..!

నల్లగొండ, మనసాక్షి.

నేషనల్ హెరాల్డ్ కేసు కోర్టు కొట్టేయడంతో, నేషనల్ హెరాల్డ్ పేరుతో బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని సోనియాగాంధీని టార్గెట్ చేయడంతో కాంగ్రెస్ పార్టీ కేసు కొట్టేసినందున బిజెపి కార్యాలయాలను ముట్టడించాలని పిలుపు నివ్వడంతో గురువారం డిసిసి అధ్యక్షుడు పునకైలాస్ నేత ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని బిజెపి కార్యాలయానికి ముట్టడించడానికి తరలివచ్చారు.

అయితే కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడానికి బిజెపి శ్రేణులు సైతం కార్యాలయంలో సిద్ధంగా ఉన్నారు పరిస్థితిని గమనించిన పోలీసులు కార్యాలయానికి దూరంలోనే కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకొని నిలువరించారు. ఇటు బిజెపి కార్యకర్తలు కార్యాలయం నుండి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

దీంతో కార్యాలయం వద్ద కాంగ్రెస్ బిజెపి శ్రేణుల నినాదాలు మార్మోగాయి. పోలీసులతో వాగ్వి వాదం చేస్తూ బిజెపి కార్యాలయం ముట్టడించడానికి తోసుకొని వస్తున్న కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి అక్కడ నుండి తరలించారు. అలాగే బీజేపీ కార్యకర్తలను అక్కడి నుండి పంపించేశారు.

MOST READ 

  1. TG News : మైలార్ దేవుపల్లి లో ఇన్నోవా కారు భీభత్సం.. తండ్రి, కుమారుడు మృతి..!

  2. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  3. Rythu : కౌలు రైతులకు గుడ్ న్యూస్.. రూ. లక్ష వరకు రుణం..!

  4. TG News : రైతులకు మరో శుభవార్త.. ఎరువుల పంపిణీకి మొబైల్ యాప్, ఇంటి వద్ద నుంచే బుకింగ్..!

  5. SBI : నిరుద్యోగులకు SBI గుడ్ న్యూస్.. కొత్తగా 6,500 ఉద్యోగాలు..!

మరిన్ని వార్తలు