తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునిజామాబాద్

Nizamabad : మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత.. అఖిల పక్షం రోడ్డుపై భైఠయింపు..!

Nizamabad : మార్కెట్ తరలింపు కోసం ఉద్రిక్తత.. అఖిల పక్షం రోడ్డుపై భైఠయింపు..!

భీంగల్, మన సాక్షి :

వ్యాపార సంస్థలకు, ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారిన కూరగాయల మార్కెట్ను తరలించాలని వ్యాపారులు, అఖిల పక్షం ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. గత మూడు, నాలుగు నెలల నుండి మార్కెట్ ను ఓల్డ్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోకి తరలించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు, వినతులు చేసినా అధికారులు మార్కెట్ తరలింపు లో నిర్లక్ష్యం వహిస్తూ వస్తున్నారు. కొందరు కూరగాయల వ్యాపారులు వ్యాపారస్తుల షాప్స్ ఎదుట వారి వ్యాపారాలు ఏర్పాటు చేసుకుని ఇబ్బంది క‌లిగిస్తున్నారు. దీంతో పాటు ట్రాఫిక్ కు ఇబ్బంది చేస్తున్నారు.

విసుగు చెందిన వ్యాపారులు అఖిలపక్షం సహకారంతో సోమవారం ఆందోళనకు దిగారు. మున్సిపల్ కమిషనర్ తీరును నిరసించారు. కూరగాయల వ్యాపారులకు వంత పడుతున్నట్టు ఆరోపణలు చేశారు.ఈ నేపథ్యంలో పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం సంతలో దుకాణాలు ఏర్పాటు చేసేందుకు వచ్చిన వారిని తహసీల్దార్ ఓపెన్ ప్లేస్ కు తరలించారు.

చిన్న, చిన్న షాప్ ల వారు ఆందోళనకారుల వినతి మేరకు తహసీల్దార్ కార్యాలయం, ఆవరణలోకి వెళ్ళగా, మరికొందరు అధికారుల ఆదేశాల మేరకు షాప్స్ తీసేందుకు అంగీకరించారు. తహసీల్దార్ షబ్బీర్, సీఐ సత్యనారాయణ, ఎస్సై లు సందీప్, రాము, అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో బందో బస్తు ఏర్పాటు చేశారు.

MOST READ : 

  1. Miryalaguda : నామినేషన్లు వేసే వారికి హెల్ప్ డెస్క్ ద్వారా సహకరించాలి.. జిల్లా కలెక్టర్ ఆదేశం..!

  2. Murder : గిరిజన మహిళను హత్య చేసి బావిలో పడేసిన ఉదంతం.. నాలుగు రోజుల తర్వాత వెలుగులోకి..!

  3. Miryalaguda : సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ కు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ..!

  4. Nalgonda : రూ.300 కోట్లతో బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ.. డైరెక్టర్ ఇంటిముందు బాధితుల ఆందోళన..!

మరిన్ని వార్తలు