Breaking Newsజనగామ జిల్లాజిల్లా వార్తలురాజకీయం

జనగామలో ఉద్రిక్తత.. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

జనగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ లక్కీ డ్రా ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగించారు.

జనగామలో ఉద్రిక్తత.. లాటరీ ద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నిక..!

మన సాక్షి, వెబ్ డేస్క్ :

జనగామ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ లక్కీ డ్రా ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కొనసాగించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఓట్లు వేశారు. దాంతో బీఆర్ఎస్ కు 16, కాంగ్రెస్ పార్టీకి 16 సభ్యుల మద్దతు లభించింది. మ్యాజిక్ ఫిగర్ 17 రావలసి ఉండగా లక్కీ డ్రా ద్వారా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు.
ఎన్నికల అధికారి నిర్ణయం మేరకు లక్కీ డ్రా లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి బాలమణి ని అదృష్టం వరించింది.

మరిన్ని వార్తలు