Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking NewsTOP STORIESతెలంగాణ

BREAKING NEWS : టాప్ 6.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి ఎప్పటికప్పుడు అందిస్తున్న బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

BREAKING NEWS : టాప్ 6.. మన సాక్షి ఫ్లాష్ న్యూస్..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

మన సాక్షి ఎప్పటికప్పుడు అందిస్తున్న బ్రేకింగ్ న్యూస్ మీకోసం..

👉ఈనెల 19న ఢిల్లీ వెళ్ళనున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఢిల్లీలోని ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కెసి వేణుగోపాల్ తో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ తో పాటు పలువురు మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ పై చర్చించనున్నారు.

👉మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు సమంగా సభ్యులు మద్దతు తెలియజేయడం వల్ల ఎన్నికల అధికారి లాటరీ ద్వారా ఎంపిక చేయగా కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది. చైర్మన్ అభ్యర్థిగా శ్రావణ్ కుమార్ విజయం సాధించారు.


👉జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు సమంగా సభ్యుల మద్దతు ఉంది. దాంతో ఎన్నికల అధికారి లాటరీ ద్వారా చైర్మన్ ఎంపిక నిర్వహించగా కాంగ్రెస్ పార్టీని అదృష్టం వరించింది.

👉ఇబ్రహీంపట్నం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఉద్రిక్తల నడుమ చైర్మన్ ఎన్నిక నిర్వహించారు. చైర్మన్ గా టేకుల సుదర్శన్ రెడ్డి ఎన్నికయ్యారు.

👉సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా ఎనిమిదో వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ ప్రమీల, వైస్ చైర్మన్ గా 12 వ వార్డు పటోళ్ల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. దాంతో ఆనందోత్సవాలలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అనుచర వర్గం ఉన్నది.

👉మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక మరోసారి వాయిదా పడింది. ఈనెల 16వ తేదీన కేతనపల్లి మున్సిపాలిటీ చైర్ పర్సన్ ఎన్నిక 17 కు వాయిదా పడగా 17వ తేదీన (మంగళవారం) ఎన్నిక నిర్వహించే సమయంలో కౌన్సిలర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం వల్ల మరోసారి వాయిదా వేశారు.

👉మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికలు మంగళవారం 11 మున్సిపాలిటీలలో నిర్వహించగా కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలలో చైర్ పర్సన్ల ఎన్నిక మరోసారి వాయిదా వేశారు. మిగతా 10 మున్సిపాలిటీలలో ఏడు మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. రెండు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్, ఒక మున్సిపాలిటీ బిజెపి గెలుచుకుంది. బీఆర్ఎస్ గెలుచుకున్న ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై హైకోర్టు స్టే విధించింది.

Our YouTube Channel

Rythu Badii YouTube Channel

మరిన్ని వార్తలు