Hyderabad : కట్ట మైసమ్మ గుడి ఘటనతో నేరేడ్ మెట్ లో ఉద్రిక్తత..!
మల్కాజిగిరి పరిధిలోని సఫిల్‌గూడలో ఉన్న కట్ట మైసమ్మ దేవాలయంలో చోటుచేసుకున్న అపవిత్ర ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Hyderabad : కట్ట మైసమ్మ గుడి ఘటనతో నేరేడ్ మెట్ లో ఉద్రిక్తత..!
మేడ్చల్ మల్కాజిగిరి, మన సాక్షి :
మల్కాజిగిరి పరిధిలోని సఫిల్‌గూడలో ఉన్న కట్ట మైసమ్మ దేవాలయంలో చోటుచేసుకున్న అపవిత్ర ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నిన్న రాత్రి దేవాలయం వద్ద ఉన్న బొడ్రాయిపై ఓ అగంతకుడు అమ్మవారి విగ్రహం ముందు మల–మూత్ర విసర్జన చేసినట్లు స్థానికులు గుర్తించారు.
ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే నిందితుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు భారీ సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు నేరేడ్మెట్ పోలీసులు పెద్ద ఎత్తున బలగాలు మోహరించి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు.
ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేశారు.
ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో, గుడి పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ, పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.









