TOP STORIESBreaking Newsతెలంగాణవ్యవసాయం

TG : తెలంగాణలో ఆ రైతులకు శుభవార్త.. ఎకౌంట్లోకి డబ్బులు, చెక్ చేసుకోండి..!

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

TG : తెలంగాణలో ఆ రైతులకు శుభవార్త.. ఎకౌంట్లోకి డబ్బులు, చెక్ చేసుకోండి..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణలో రైతులకు ప్రభుత్వం శుభవార్త అందజేసింది. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలను విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాంతో మరో రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో నగదు జమ కానున్నాయి. రాష్ట్రంలో మొక్కజొన్న రైతులకు చెల్లించేందుకు మార్క్ ఫెడ్ కు ప్రభుత్వం 171 కోట్ల రూపాయలను విడుదల చేసింది. మార్క్ ఫెడ్ ద్వారా రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.

వానకాలం పంటల సీజన్ కు సంబంధించి మార్క్ఫెడ్ 3.77 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ను రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఈ మొక్కజొన్న ను సుమారు 78,500 మంది రైతులు విక్రయించారు. అయితే వారికి చెల్లించాల్సిన సొమ్ము ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. కాగా పెండింగ్‌లో ఉన్న డబ్బులను ప్రభుత్వం విడుదల చేస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరో రెండు, మూడు రోజుల్లో రైతుల ఖాతాలలో జమకానున్నాయి. మొక్కజొన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తొలి దశలో 739.39 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అనంతరం పెండింగ్‌లో ఉన్న 171 కోట్ల రూపాయలను ప్రస్తుతం విడుదల చేసింది.

MOST READ

మరిన్ని వార్తలు