తెలంగాణBreaking NewsTOP STORIES

TG : తెలంగాణ నూతన గవర్నర్ శుక్ల నేపథ్యం.. తెలుసుకుందాం..!

తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ను కేంద్రం నియమించింది. ఇంతకాలం పాటు గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. శివ ప్రతాప్ సింగ్ ఎవరు..

TG : తెలంగాణ నూతన గవర్నర్ శుక్ల నేపథ్యం.. తెలుసుకుందాం..!

మన సాక్షి, వెబ్ డెస్క్ :

తెలంగాణ నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా ను కేంద్రం నియమించింది. ఇంతకాలం పాటు గవర్నర్ గా ఉన్న జిష్ణు దేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. శివ ప్రతాప్ సింగ్ ఎవరు..?

ఆయన నేపథ్యం..

శివ ప్రతాప్ సింగ్ ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యక్తి. 1952 ఏప్రిల్ ఒకటిన గోరక్ పూర్ జిల్లాలోని రుద్రపూర్ గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన రాజకీయవేత్త, న్యాయవాది, రాజనీతిజ్ఞుడు. విద్యార్థి దశలో ఏబీవీపీ సంస్థగత కార్యదర్శిగా పనిచేసి 1983లో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయన తొలిసారిగా 1989లో ఉత్తరప్రదేశ్లోని గోరఖ్ పూర్ అర్బన్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి నాటి కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ శాస్త్రిని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆ తర్వాత 1989 తో పాటు 1991, 1993, 1996లో వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ లోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో ఆయన రాష్ట్ర మంత్రిగా నియమితులయ్యారు. భారతీయ జనతా పార్టీ – బహుజన సమాజ్ పార్టీ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో జైళ్ల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 1998లో రాజ్ నాథ్ సింగ్ బీజేపీ ప్రభుత్వంలో గ్రామీణ అభివృద్ధి మంత్రిగా పనిచేశారు.

2016లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2017లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి బదిలీ అయ్యారు.

MOST READ : 

మరిన్ని వార్తలు