TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాల విడుదల విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. ఈ విధానం ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.

TG News : ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..!
మన సాక్షి, హైదరాబాద్ :
ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాల విడుదల విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్వహించింది. ఈ విధానం ఏప్రిల్ నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది.
(ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టం) IFMIS పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే వేతనాల విడుదల చేయబడతాయి. ప్రభుత్వ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం ఇస్తుంది.
ప్రభుత్వం, కార్పొరేషన్ ఉద్యోగులు అందరూ IFMIS పరిధిలోకి వస్తారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగుల వేతనాలు ఇకపై ఈ విధానం ద్వారానే విడుదల అవుతాయి. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. రాబోయే క్యాబినెట్ సమావేశంలో చర్చించి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల విషయంలో కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా IFMIS ద్వారా వేతనాలు విడుదల చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని, అకౌంటెబిలిటీ పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది. దాంతోపాటు వేతనాల చెల్లింపులు ఉద్యోగులకు సకాలంలో అందే అవకాశం ఉంటుందని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
MOST READ NEWS
-
Miryalaguda : హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి.. 40వ వార్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం..!
-
కోదాడలో బస్సు డ్రైవర్ కు ఏడాది జైలు శిక్ష.. రూ.2వేలు జరిమానా..!
-
Miryalaguda : ఫర్టిలైజర్ యూరియా యాప్ పై మిర్యాలగూడలో రైతులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి..!
-
ACB : రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన అవినీతి తిమింగలం..!