TGSRTC : అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..!

TGSRTC : అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు..!
సంస్థాన్ నారాయణపురం, మన సాక్షి:
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలంలోని జనగాం నారాయణపురం వెళ్లే మార్గంలో చోటు చేసుకుంది.బస్సు డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ డిపో కి చెందిన TG.05Z0045 నంబర్ ఆర్టీసీ బస్సు నల్లగొండ నుండి చౌటుప్పల్ కి వెళ్ళే సమయంలో జనగాం వద్ద ముందుగా వెళ్తున్న కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది.
దీంతో బస్సు రోడ్డు పక్కకు ఒరిగింది. ఆర్టీసీ బస్సు డ్రైవర్ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.కారును తప్పించపోయే క్రమంలో బస్సు అదుపు తప్పడానికి కారణమని ప్రయాణికులు తెలిపారు.బస్సులో 100 మంది కి పైగా ప్రయాణికులు ఉన్నారు.కానీ అదృష్టవశాత్తూ బస్సులో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
MOST READ :
-
Heavy Rain : తెలంగాణలో మరో మూడు గంటల్లో భారీ వర్షం.. ఆ జిల్లాల్లో అలెర్ట్..!
-
Mushroom Coffee : మష్రూమ్ కాఫీ.. ఇది కేవలం ట్రెండ్ కాదు.. ఆరోగ్య రహస్యం..తెలుసుకోండి ఇలా..!
-
Nalgonda : దళిత మైనర్ బాలికపై అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి.. పోక్సో కేసు నమోదు..!
-
Water Supply : 258 గ్రామాలకు రేపటి నుంచి నీటి సరఫరా నిలిపివేత..!









