Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనాగర్ కర్నూల్ జిల్లా
KLI : తెగిపోయిన కేఎల్ఐ కాలువ.. వృధాగా పోతున్న నీరు..!

KLI : తెగిపోయిన కేఎల్ఐ కాలువ.. వృధాగా పోతున్న నీరు..!
వెల్దండ, మన సాక్షి:
వెల్దండ మండల పరిధిలోని పోతేపల్లి గ్రామ సమీపాన ఉన్న కే ఎల్ ఐ డి 82 కాలువకు ఆదివారం తెల్లవారు జామున గండిపడి నీరు వృధాగా పోతుంది. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా సంబంధిత అధికారులు కాల్వ గండికి తక్షణమే మరమ్మతులు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పంట పొలాలకు సాగునీరు అందించే కేఎల్ఐ డీ 82 కాల్వకు ఇటీవల ఆగస్టు 10న లచ్చపురం సమీపంలోగండిపడిన విషయం తెలిసినదే. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ఇటీవలే గండికి మరమ్మతులు పూర్తి చేశారు.
ఈ కాలువ ద్వారా పూర్తిస్థాయిలో చివరి ఆయకట్టు వరకు మాడుగుల మండలం నాగిళ్ల వరకు సాగునీరు అందించడమే లక్ష్యం. ఇటీవల కురిసిన వర్షాల దాటికి కాలువ మరో మారు గండి పడింది. దీంతో రైతులు తమ పంటలు నీటిలో మునిగిపోతాయని స్థానిక రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
MOST READ :









