Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

BREAKING : ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం.. కోట్ల రూపాయలతో జెండా ఎత్తిన సంస్థ..!

BREAKING : ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపి మోసం.. కోట్ల రూపాయలతో జెండా ఎత్తిన సంస్థ..!

సూర్యాపేట, మనసాక్షి :

నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో ప్రారంభమైన ఆర్టీజీఏ సంస్థ ప్రజలకు కోట్ల రూపాయలను ఆశ చూపి లక్షల్లో కట్టించుకొని నిలువునా మోసం చేసిన వైనం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. గత జూలై నెలలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో అమెరికాకు చెందిన సంస్థగా చెబుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలంటూ ఓ వ్యక్తి ఆర్టీజీఏ సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు.

తరువాత అవగాహన సదస్సులు పెడుతూ వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి రూ 1800లు కట్టించుకోవడమే కాకుండా వారు మరి కొంత మందితో డబ్బులు కట్టించేలా జిల్లా కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు మద్యవర్తులుగా పెట్టుకున్నాడు. వీరి ద్వారా ఈ సంస్థల్లో 1800లు కట్టి సభ్యత్వం తీసుకుంటే యాప్ ఇచ్చి ప్రతి రోజు 4 నుంచి 5 యాడ్లను పంపిస్తూ వాటిని చూసిన వారికి ప్రతి రోజు రూ. 60లను యాప్లో జమా చేస్తుంటారు.

ఇలా 1800లు కడితే రోజుకు 60రూపాయలు, 4,500లు కడితే 260, 15వేలు కడితే 540, 45వేలు కడితే 1620, లక్షా 20 వేలు కడితే 4,650రూపాయలు ప్రతి రోజు వస్తుంటాయి. ఇవే కాకుండా ఒక వ్యక్తి కింద 400ల మంది సభ్యులు చేరితే వారికి లక్ష రూపాయల వేతనంతో పాటు వారు సమావేశాన్ని పెట్టుకునేందుకు అయ్యే ఖర్చును ఇస్తూ వచ్చారు.

ఇలా జమ అయిన రొక్కన్ని వారంలో ఒక రోజు ప్రతి బుధవారం విత్డ్రాయల్ పెట్టుకునే అవకాశాన్ని కల్పించగా నిన్న బుధవారం విత్డ్రాయల్ అప్షన్ కనిపించక పోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సంస్థ ఎత్తేశారని తెలియడంతో కొందరు తమ బందువులు, తెలిసిన వారికి మీ డబ్బులకు మాది గ్యారంటీ అంటూ ప్రామిసరీ నోట్లు రాసి ఇచ్చి లక్షల్లో మోసపోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 50వేల మంది ఉన్న ఆర్ జీఏ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయమై సదరు మోటివేటర్స్ ను లబ్దిదారులు నిలదీయగా తాము కూడా మోసపోయామని చెప్పుకొచ్చారు. ఆర్ జీఏ బాధితులు ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సూర్యాపేట పోలీస్టేషన్ కు వస్తుండడంతో పోలీసులు సదరు మోటివేటర్స్ ను స్టేషన్ కు తీసుకొచ్చి విచారిస్తున్నట్లు తెలిసింది.

(Reporting : Muthyam Raju,

ManaSakshi, Suryapet)

LATEST UPDATE :

మరిన్ని వార్తలు