BREAKING : విద్యుత్ తీగలలే యమపాశాలయ్యాయి.. భార్య మృతి భర్త పరిస్థితి విషమం..!
BREAKING : విద్యుత్ తీగలలే యమపాశాలయ్యాయి.. భార్య మృతి భర్త పరిస్థితి విషమం..!
-ట్రాక్టర్ కు 11 కెవి విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం
-నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
కనగల్, మన సాక్షి :
నల్లగొండ జిల్లా కనగల్ మండలంలోని అమ్మగూడెంలో ఆదివారం విషాద ఘటన జరిగింది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వ్యవసాయ పొలంలోని గడ్డికట్టలను తీసుకొచ్చేందుకు ట్రాక్టర్ వెళుతుండగా మార్గమధ్యలోని ఓ రైతు వ్యవసాయ పొలంలో క్రిందికి ప్రమాదకరంగా వేలాడుతున్న 11 కెవి విద్యుత్ వైర్లు ట్రాక్టర్ కు తగిలి ఈ ప్రమాదం జరిగింది.
అమ్మగూడెం గ్రామానికి చెందిన మాచర్ల అంజిబాబు అతని భార్య మనీషా (19) ఇద్దరు తమ సొంత ట్రాక్టర్ ను నడుపుకుంటూ వ్యవసాయ పొలంలోని గడ్డి కట్టలను తీసుకువచ్చేందుకు వెళుతుండగా మార్గమధ్యలో 11 కె.వి కరెంటు వైర్లు ట్రాక్టర్ ట్రాలీకి అమర్చిన ఐరన్ పైపుకు తగిలాయి.
ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ఇంజన్ మడ్ గార్డ్ పై కూర్చున్న అంజిబాబు భార్య మనీషాకు తీవ్రంగా విద్యుత్ షాక్ తగలడంతో ఘటనా స్థలంలోనే అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. మనిషా చర్మం పలుచోట్ల విద్యుత్ షాక్ గురై కాలింది. ట్రాక్టర్ నడుపుతున్న అంజిబాబుకు సైతం విద్యుత్ షాక్ కారణంగా కాళ్లు, తొడ భాగం పలుచోట్ల తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి.
బాధితులిద్దరిని చికిత్స నిమిత్తం 108 లో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా అప్పటికే మనీషా మృతి చెందింది. విద్యుదాఘాతంతో తీవ్రగాయాల పాలైన అంజిబాబు ఐసీయులో చికిత్స పొందుతున్నాడు. భార్యాభర్తలిద్దరికీ విద్యుత్ ప్రమాదం జరగడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. పెళ్లైన నెలల వ్యవధిలోనే వధువు పాలిట విద్యుత్ తీగలు యమపాశాలయ్యాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కిందికి వ్రేలాడుతున్న 11 కెవి కరెంటు వైర్లను స్తంభం పాతి పైకి ఏర్పాటు చేయాలని పలుమార్లు గ్రామస్తులు విన్నవించినా విద్యుత్ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికే మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో చాలా ఘటనలు ఇలాంటివి జరిగి ప్రాణాలు కోల్పోయినా విద్యుత్ శాఖలో చలనం లేకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. తమకు న్యాయంచేసి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు.
(Reporting : Saidulu, Kanagal)
MOST READ :
-
Miryalaguda : మిల్లర్ల సిండికేట్.. ధాన్యం ధరలు తగ్గింపు, రహదారిపై రైతుల ఆందోళనలు..!
-
District collector : ప్రభుత్వం ఓటీపీలు అడగదు.. లింకులు పంపదు, వివరాలకు కోడ్, జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Hyderabad : కుటుంబ సర్వే.. 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్వైజర్..!
-
Rythu Bharosa : రైతు భరోసా కు డేట్ ఫిక్స్.. కఠినమైన నిబంధనలు..!









