Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!
Govt Scheme : ఆ రైతులకు అదిరిపోయే స్కీం.. ఎకరానికి రూ.9600 రాయితీ..!
నాగారం, మనసాక్షి
తక్కువ కాలం లో ఎక్కువ ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటలను సాగుచేసి రైతులు అధిక ఆదాయం పొందాలని తుంగతుర్తి డివిజన్ ప్రాంతీయ ఉద్యాన అధికారిని వి ప్రమిత అన్నారు. శుక్రవారం మండలం లో ఉద్యాన పంటలను సందర్శించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆధిక ఆదాయాన్ని ఇచ్చే పండ్లు కూరగాయలు మరియు ఇతర ఉద్యాన పంటల సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాయని, వివిద పథకాలకు సంబందించిన 2025-26 వార్షిక ప్రణాళికలు రాష్ట్ర
ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు.
ఆయిల్ పామ్ విస్తరణ పథకం, సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, సూక్ష్మ నీటి పారుదల పథకం, వెదురు మిషన్ పథకాలకు దరఖాస్తు చేసుకునే రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకువాలని సూచించారు.
పాత మామిడి తోటల పునరుద్ధరణ పథకం కింద రైతులకు ఎకరానికి 9600/- రూపాయలు రాయితీ అందించడం జరుగుతుందన్నారు. రైతులు ప్రభుత్వం అందించే రాయుతిలను సద్వినియోగం చేసుకొని ఉద్యాన పంటల సాగు వైపు మొగ్గు చూపాలన్నారు.
ఈ కార్యక్రమం లో పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ ఏరియా మేనేజర్ వి శశి కుమార్, ఉద్యాన విస్తరణ అధికారి రంగు ముత్యంరాజు, మహేంద్ర డ్రిప్ కంపెనీ డీ సీ ఓ అఖిల్ రైతు పెసర సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
-
PMKY : రైతుల ఖాతాలలోకి రూ.18 వేలు.. ఇలా చేస్తే చాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : మావోయిస్టు సిద్ధాంతకర్త, పార్టీకి బ్యాక్ బోన్.. పాఠాలు నేర్పిన ఆమె లొంగిపోయారు..!
-
Holidays : విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త.. వరుసగా 13 రోజులు సెలవులే..!
-
Nagarjunasagar : నాగార్జునసాగర్ కు భారీ వరద ప్రవాహం.. అవుట్ ఫ్లో 4.83 లక్షల క్యూసెక్కులు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : బంగారం ధరలకు ఇక బ్రేక్.. ఈరోజు తగ్గిందెంత.. తులం ధర ఎంతంటే..!









