Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

BREAKING : సూర్యాపేటలో కొడుకునే హత్య చేసిన తండ్రి..!

BREAKING : సూర్యాపేటలో కొడుకునే హత్య చేసిన తండ్రి..!

సూర్యాపేట,  మనసాక్షి :

మద్యానికి బానిసై తరుచూ వేధిస్తున్న కొడుకును తండ్రి హతమార్చిన సంఘటన ఆత్మకూరు ఎస్ మండలం కొత్తతండ పరిధిలోని బాపూజీ తండలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మద్యానికి బానిసై డబ్బుల కోసం వేధిస్తున్న కొడుకు బానోత్ కిరణ్ (37) ను అతని తండ్రి పంతులు గొడ్డలితో దాడి చేసి హతమార్చినట్లు స్థానికులు తెలిపారు.

మృతుడు కిరణ్ తన తండ్రిని తరుచూ డబ్బులు ఇవ్వాలంటూ వేధిస్తూ ఉండేవాడని బుధవారం సాయంత్రం కూడా ఇంట్లో ఎవరూ లేని సమయంలో తండ్రి పంతులును డబ్బులు ఇవ్వమంటూ మద్యం మత్తులో గొడవ పడ్డట్లు తెలిపారు.

అదే సమయంలో విసిగి వేసారిన తండ్రి పంతులు పక్కన ఉన్న గొడ్డలితో కిరణ్ పై దాడి చేయగా తల, ముఖంపై తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు.

చుట్టుపక్కల వారు అది గమనించి పోలీస్ లకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సైదులు సూర్యాపేట రూరల్ సిఐ సురేందర్ రెడ్డి తమ క్లూజ్ టీమ్ తో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తండ్రి పంతులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. మృతుడు కిరణ్ కు భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

LATEST UPDATE : 

BIG BREAKING : కౌశిక్ రెడ్డి ఇంటికి అరికెపూడి.. రాష్ట్రంలో హై టెన్షన్..!

మహిళలకు సువర్ణావకాశం.. దరఖాస్తు చేసుకున్న రెండు రోజుల్లో రూ.5 లక్షలు..!

వాటర్ ట్యాంక్ పై కొలువుదీరిన వినాయకుడు..!

రైతు భరోసా ఇచ్చే ఉద్దేశ్యం ఉందా.. రుణమాఫీ లెక్కనేనా.!

మరిన్ని వార్తలు