BIG BREAKING : శ్రీశైలంకు గంట గంటకు పెరుగుతున్న వరద.. ఈరోజే ఎత్తనున్న 4 గేట్లు..!
BIG BREAKING : శ్రీశైలంకు గంట గంటకు పెరుగుతున్న వరద.. ఈరోజే ఎత్తనున్న 4 గేట్లు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో:
శ్రీశైలం జలాశానికి వరద పోటు గంట గంటకు పెరుగుతోంది. కర్ణాటక, మహారాష్ట్ర తో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది, తుంగభద్ర నది ఉప్పొంగుతుంది. ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం జలాశయానికి 4.36 లక్షల వరద పెరిగి జలాశయం మట్టం భారీగా పెరిగింది. జలాశయం నిండుకుండల మారింది. శ్రీశైలం జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులకు గాను ప్రస్తుతం 870 అడుగులకు చేరింది. దాంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ముందుగా మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి రామానాయుడు గేట్లు ఎత్తాలని భావించినప్పటికీ శ్రీశైలం జలాశయం కు వరద పోటు పెరగడంతో (సోమవారం) ఈరోజు సాయంత్రం 4 గంటలకే 4 గేట్లు అధికారులు ఎత్తే ఆలోచనలో ఉన్నారు. నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయనున్నారు.
ఇవి కూడా చదవండి :
Srisailam : శ్రీశైలంకు కొనసాగుతున్న భారీ వరద.. గేట్లు ఎత్తేందుకు తేదీ ఫిక్స్..!
రైతులకు రూ. 5 లక్షల పథకం.. అర్హతలు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి, ఆగస్టు 5 చివరి తేదీ..!









