Anganwadi Workers : అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త..!
Anganwadi Workers : అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం భారీ శుభవార్త..!
మన సాక్షి, హైదరాబాద్ :
తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు శుభవార్త తెలియజేసింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంది. ఎన్నికల హామీల్లో భాగంగా అంగన్వాడి టీచర్లకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది.
అందుకుగాను మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. 3989 మినీ అంగన్వాడీ టీచర్లను మెయిల్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోట్ చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. దాంతో మినీ అంగన్వాడి టీచర్లు కూడా అంగన్వాడి టీచర్ల వేతనం అందుకొనున్నారు. ఇకపై మినీ అంగన్వాడి మెయిన్ అంగన్వాడి అనే తేడా లేకుండా అందరూ అంగన్వాడీ టీచర్లేనని స్పష్టం చేసింది.
ఈ నెల నుంచే అమల్లోకి ఉత్తర్వులు రానున్నాయి. ఏప్రిల్ నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకు నెలకు 13,650 ఇవ్వనున్నది. గతంలో మినీ అంగన్వాడి టీచర్లకు 7800 రూపాయలు మాత్రమే ఇచ్చేది. కాగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మినీ అంగన్వాడీ టీచర్లకు కూడా 13,650 రూపాయలు అందనున్నాయి.
MOST READ :
-
TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!
-
Rythu : రైతులకు భారీ గుడ్ న్యూస్.. ఈరోజు సాయంత్రం లోగా ఖాతాలలో నగదు జమ..!
-
Milk : ఎండాకాలంలో పాలు పాడవుతున్నాయా.. ఐతే ఇలా చేయండి..!
-
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
-
Farmer Registry : ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రీ కార్డు.. ప్రారంభమైన ధరఖాస్తులు.. ఈ కార్డు ఉంటేనే పథకాలు..!









