Khammam : వడ్డీల వ్యాపారి ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. 90 లక్షల విలువైన వాహనాలు జప్తు..!
Khammam : వడ్డీల వ్యాపారి ఇంట్లో పోలీసుల సోదాలు.. రూ. 90 లక్షల విలువైన వాహనాలు జప్తు..!
కల్లూరు,(మన సాక్షి)
ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం లో అనుమతులు లేకుండా వడ్డీల వ్యాపారం చేస్తున్న వ్యక్తిని విచారణ చేసి అతని వద్ద ఉన్న ద్విచక్ర వాహానాలు, కార్లు (వాటి విలువ 90 లక్షల)గల వాహనాలను పోలీస్ వారు జప్తు చెయ్యడం జరిగింది.
ఎస్సై హరిత తెలిపిన వివరాల ప్రకారం.. కల్లూరు పట్టణంలో ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న మహమ్మద్ హబీబ్ (వడ్డీల బాబా) అయినటువంటి వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా సామాన్య ప్రజల ఆర్ధిక అవసరాలను అవకాశముగా మలుచుకుని వారి యొక్క వాహానాలను అక్రమముగా అధిక వడ్డీరేట్లకు (సుమారుగా 10 రూపాయల వడ్డీ కీ) తాకట్టు పెట్టుకుని పీడిస్తున్నాడని సమాచారం అందింది.
ముందుగా మాట్లాడుకున్న నిబందనలు కూడా ఉల్లంఘించి మోసం చేయుచున్నాడనే సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశములపై తనిఖీ చేశారు.అతడి ఇంటివద్ద 15 ద్విచక్ర వాహనములు, 4 కార్లు గుగుర్తించి 90 లక్షల విలువైన వాహనాలు జప్తు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై డి హరిత తెలిపారు.
MOST READ :
-
Ramasamudram : కేబుల్ వైర్ల దొంగల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి..!
-
TG News : చౌటుప్పల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డిఎస్పీలు మృతి..!
-
Modi : ప్రధానమంత్రిగా మోడీ సరికొత్త రికార్డ్.. ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేసిన మోదీ..!
-
ACB : ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!









