Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!
Krishna Floods : కాసులు కురిపిస్తున్న కృష్ణా నది వరద..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
కృష్ణా నది వరద కాసులు కురిపిస్తుంది. కృష్ణా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రాజెక్టులన్నీ నిండుకుండలా ఉన్నాయి. నారాయణపూర్ మొదలుకొని పులిచింతల ప్రాజెక్టు వరకు కూడా గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులు నిండితే పంట పొలాలకు సమృద్ధిగా జలాలు అందుతాయి. కాలువల నిండుగా నీరు పారుతుంది. రైతులకు మేలు జరుగుతుంది. కానీ మరి కాసులు ఎలా కురిపిస్తున్నట్టు.. ఆ విషయం తెలుసుకుందాం..
శ్రీశైలం వద్దనే రోజుకు 14 కోట్లు :
శ్రీశైలం జల విద్యుత్తు తో రోజుకు 14 కోట్ల లాభాన్ని జెన్ సాధిస్తుంది. కృష్ణానది వరద కాసులు కురిపిస్తోంది. కృష్ణానది బేసిన్ లో ఉన్న జూరాల నుంచి పులిచింతల ప్రాజెక్టు దాకా ప్రతిరోజు 3.7 కోట్ల యూనిట్ కరెంటు ఉత్పత్తి జరుగుతుంది. ఆ విధంగా ప్రతి యూనిట్ కు 4 రూపాయల చొప్పున 14 కోట్ల లాభాన్ని జెన్ కో గడిస్తుందని చెప్పవచ్చును.
ఇప్పటివరకు ఈ సీజన్ లో 552 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. వరద ఇంకా కొనసాగుతుండగా మరింత విద్యుత్తు ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వరదతో పాటు ప్రాజెక్టులు కూడా నిండుకుండలా ఉండడం వల్ల జల విద్యుత్తు భారీగా ఉత్పత్తి కానున్నది.
ఇవి కూడా చదవండి :
Rythu Barosa : రైతు భరోసా వారికేనా.. ఆలస్యం అందుకేనా..!
భారీ గుడ్ న్యూస్ : ఫోన్ పే, గూగుల్ పే మీకు ఉందా..! ఉంటే తెలుసుకోవాల్సిందే
Good News : రైతులకు కేంద్రం సర్కార్ గుడ్ న్యూస్.. ఎరువుల ధరపై సబ్సిడీ పెంపు..!









