PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!

PhonePe : ఫోన్ పే లో సరికొత్త ఫీచర్.. సైబర్ నేరాలకు చెక్..!
మన సాక్షి, ఫీచర్స్ డెస్క్ :
ఫోన్ పే ద్వారా చెల్లింపులు రోజురోజుకు పెరుగుతున్నాయి. క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు సహాయంతో ఈ చెల్లింపులు కొనసాగుతున్నాయి. కాగా ఫోన్ పే లో సరికొత్త ఫీచర్ వచ్చేసింది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేకపోయినా దాని పిన్ మరియు CVV నెంబర్లు లేకపోయినా మీరు చెల్లింపులు చేయవచ్చును. దానివల్ల సైబర్ నేరాలు చెక్ పెట్టే అవకాశం ఉంది.
ఫోన్ పే వినియోగదారులు EMI చెల్లించాలనుకుంటే లేదా కరెంట్ బిల్లు, నీటి బిల్లులు చెల్లించాలంటే గతంలో కరెంటు లేదా డెబిట్ కార్డు వివరాలను వ్యాపారి ప్లాట్ ఫామ్ లో ముందుగానే నమోదు చేసి సేవ్ చేయాల్సి వచ్చేది. ఇకపై అలాంటి సమస్య లేదు. ప్రతి లావాదేవీ కి CVV నెంబర్ జోడించాల్సిన అవసరం లేదు. దానికోసం పరికర టోకనైజేషన్ పరిష్కారాన్ని ప్రారంభించింది.
దాని అర్థం వినియోగదారులు ఇప్పుడు ఫోన్ పే యాప్ లో తమ కార్డులను టోకనైజ్ చేయాలి. దాంతో బిల్లులు, ఇన్సూరెన్స్ చెల్లింపులు చేయవచ్చును. అయితే ఈ కొత్త ఫీచర్ తో వినియోగదారులు మెరుగైన భద్రత సౌలభ్యాన్ని పొందే అవకాశం ఉంది.
కార్డు వివరాలను Phonepe కు సురక్షితంగా లింకు చేయడం ద్వారా సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం లేదు. అంతేకాకుండా చెల్లింపులు, భద్రత ఈ కొత్త ఫీచర్ పనిచేస్తుంది. వ్యాపారస్తులు కూడా ఈ కొత్త ఫీచర్ నుండి ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే టోకనైజ్డ్ కార్డులు చాలా వేగంగా లావాదేవీలు కల్పిస్తాయి.
Similar News :
- UPI : ఫోన్ పే, గూగుల్ పే కొత్త రూల్స్.. ఇలా చేయకుంటే మీ లావాదేవీలు ఆగిపోతాయి..!
- UPI : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు భారీ జలక్.. ఇకపై వాటికి చార్జీల మోత..!
- UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
- Phone Pe : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లు జాగ్రత్త.. ఆ ఫీచర్ ఆఫ్ చేయకుంటే మీ ఖాతా ఖాళీ.. అందరు తెలుసుకోవాల్సిందే..!
- Phone Pe : బిగ్ అలర్ట్.. నకిలీ ఫోన్ పే యాప్స్.. తెలుసుకోకుంటే ఎకౌంట్ ఖాళీ..!









