Breaking Newsకరీంనగర్జిల్లా వార్తలుతెలంగాణ

Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!

Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!

కరీంనగర్, మనసాక్షి :

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ సచ్చిదానంద స్వామి (రామాలయం) ట్రస్టు మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయాలకు సంబంధించిన ప్రభుత్వ భూములను కాపాడాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దేవాలయాలకు సమీపంలో ఉన్న క్రిస్టియన్ విద్యాసంస్థలు సెయింట్ జార్జ్ స్కూల్ కు, కొంతమందికి రియల్ స్టేట్ వ్యాపారానికి రోడ్డుకు 99 సంవత్సరాలకు గాను 98 లక్షలకు అక్రమంగా లీజకు ఇచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్బంగా వారు మీడియతో మాట్లాడుతూ.. శ్రీ సచ్చిదానంద స్వామి (రామాలయం) ట్రస్టు కమిటీకి సంబంధం లేకుండా హిందూ దేవాలయలు భూములు నుంచి క్రిస్టియన్ విద్యాసంస్థ సెయింట్ జార్జ్ స్కూల్ కు ఏరకంగా లీజుకు ఇస్తారని ప్రశ్నించారు. ట్రష్టు పేరుతో దేవాలయాల భూముల ల్లో పెద్ద ఎత్తున
అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ప్రయివేట్ విద్య సంస్థల దారి కోసం ఇచ్చిన దేవాలయ ప్రభుత్వ భూమి లీజును రద్దు చేసి దేవాలయ అవసరాలకోసం వాడుకోవాలని లేదా పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణానికి స్థలం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కవంపల్లి అజయ్, ఉపాధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు ,తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. TG News : రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిల ఎంపిక..!

  2. TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!

  3. TG News : ఆ ఉద్యోగులే లక్ష్యంగా ఘరానా మోసం.. రూ.20 కోట్ల దోపిడి..!

  4. Nagarjunasagar : నాగర్జున సాగర్ కు భారీగా పర్యాటకులు.. 22 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల..!

మరిన్ని వార్తలు