క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

ట్రాక్టర్ ను ‘ఢీ’ కొట్టిన లారీ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..!

ట్రాక్టర్ ను ‘ఢీ’ కొట్టిన లారీ.. ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం..!

కనగల్, మన సాక్షి:

నల్లగొండ జిల్లా కనగల్ మండలం బాబాసాహెబ్ గూడెం స్టేజి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను లారీ ఢీకొట్టిన ఘటనలో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

కనగల్ ఎస్సై పి. విష్ణుమూర్తి తెలిపిన వివరాల ప్రకారం… నల్లగొండ జిల్లా అనుముల మండలం పులిమామిడి పరిధి కుమ్మరికుంటకాల్వకు చెందిన గోగు లింగమ్మ (69) అదే గ్రామానికి చెందిన కన్నెబోయిన కొండల్ ట్రాక్టర్ లో వడ్లు వేసుకుని బియ్యం పట్టించేందుకు కనగల్ మండలం ఎస్. లింగోటం వచ్చారు.

బియ్యం పట్టించుకుని ట్రాక్టర్ లో స్వగ్రామం తిరిగి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన లారీ అతివేగంగా ట్రాక్టర్ ను ఢీకొట్టడంతో ట్రాక్టర్ పల్టీలు కొట్టి ట్రాలీ రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ ట్రాలీలో కూర్చున్న లింగమ్మకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

ట్రాక్టర్ డ్రైవర్ కొండలకు సైతం తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉంది. బాధితుడిని చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.

LATEST UPDATE :

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి..!

అక్రమంగా నిలువ ఉంచిన రేషన్ బియ్యం పట్టివేత..!

 Nalgonda : ప్రజాపాలన దినోత్సవం ఎప్పుడో తెలుసా.. జిల్లా కలెక్టర్ ప్రశ్నకు విద్యార్థుల సమాధానం..!

Runamafi : రుణమాఫీ కానీ వారికి సర్వే అయ్యిందా.. ఐతే ఖాతాలలోకి మాఫీ సొమ్ము..!

మరిన్ని వార్తలు