NARAYANPET : పేట బల్దియా పై కమలం జెండా ఎగిరేది ఖాయం..!
నారాయణపేట మున్సిపాలిటీ పై ఈ సారి బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ ధీమా వ్యక్తంచేశారు.

NARAYANPET : పేట బల్దియా పై కమలం జెండా ఎగిరేది ఖాయం..!
నారాయణపేట టౌన్, మనసాక్షి:
నారాయణపేట మున్సిపాలిటీ పై ఈ సారి బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి పట్టణ అధ్యక్షుడు పోషల్ వినోద్ ధీమా వ్యక్తంచేశారు. మంగళవారం ఆయన పట్టణ బిజెపి ప్రధాన కార్యదర్శులు వడ్డే దత్తు, నక్క సత్యనారాయణతో కలిసి మాట్లాడుతూ నారాయణపేట పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలకు గాను వార్డులలో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేస్తామని ఇప్పటికీ 84 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు.
ఈ నెల 14వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అని స్పష్టం చేశారు. పోటీ చేయు ఆశావాహులు రేపటి వరకు తమ తమ దరఖాస్తులు సమర్పించగలరని తెలిపారు.
దాదాపు ప్రతి వార్డుకు 3-4 గురు పార్టీ నుండి పోటీ చేయుటకు ఆసక్తి చూపుతున్నారని పోటీ తీవ్రంగా ఉందన్నారు.ఎన్నికల్లో టికెట్ ఎవరికి వచ్చిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని వార్డు కౌన్సిలర్ గా గెలిపించాలని కోరారు.
నారాయణపేట మున్సిపల్ చైర్మన్ గా ఈసారి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడానికి పట్టణ ప్రజలు ఆసక్తిగా ఉన్నారనీ అన్నారు. బిజెపి మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకోబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, డి కే. అరుణమ్మ నాయకత్వంలో నారాయణపేట పట్టణాన్ని అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని పట్టణ ప్రజలను కోరారు.









