Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణభద్రాద్రి కొత్తగూడెం జిల్లా

చీపురు పట్టుకున్న ఎంఎల్ఏ..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్ నందు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వీధులను శుభ్రం చేస్తున్న సందర్భంలోఅశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా వారి వెంట పాల్గొన్నారు.

చీపురు పట్టుకున్న ఎంఎల్ఏ..!

దమ్మపేట :

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి సెంటర్ నందు గ్రామపంచాయతీ పారిశుధ్య కార్మికులు పరిసరాల పరిశుభ్రతలో భాగంగా వీధులను శుభ్రం చేస్తున్న సందర్భంలోఅశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా వారి వెంట పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చీపురు పట్టుకుని రోడ్ల వెంట చెత్తను తొలగిస్తూ శుభ్రత పనుల్లో భాగస్వాములయ్యారు.

పారిశుధ్య కార్మికులు గ్రామాల పరిశుభ్రత కోసం చేస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. ఎండా వానా తేడా లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కార్మికులు చేస్తున్న కృషికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. అనంతరం పారిశుధ్య కార్మికులతో కాసేపు ముచ్చటించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అసెంబ్లీ వేదికగా ప్రస్తావిస్తానని వారికి భరోసా ఇచ్చారు.

By : Shanmukh, 891 911 3135

MOST READ : 

  1. Miryalaguda : ఎమ్మెల్యే బిఎల్ఆర్ హామీ.. మిర్యాలగూడలో త్వరలో సిగ్నల్ లైట్స్ ఏర్పాటు..!

  2. Nalgonda : అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం.. తాగునీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి..!

  3. Gold Price : బాబోయ్.. పసిడికి ఊహించని ధర, ఒక్కరోజే అంత పెరిగిందా.. ఆల్ టైం రికార్డ్..!

  4. Rythu Bharosa : రైతుల ఖాతాలలో రైతు భరోసా.. ప్రభుత్వం తాజా నిర్ణయం, లేటెస్ట్ అప్డేట్..!

  5. Rythu : రైతుల కోసం కేంద్రం సంచలన నిర్ణయం.. ఐదేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల జరిమానా..!

మరిన్ని వార్తలు