తెలంగాణBreaking NewsTOP STORIESనల్గొండ

Miryalaguda : ట్రాక్టర్ తో దున్ని నాట్లు వేసి.. పొలంలో రైతు కూలీలతో కలిసి ఆ ఎమ్మెల్యే రుణమాఫీ సంబరం..!

Miryalaguda : ట్రాక్టర్ తో దున్ని నాట్లు వేసి.. పొలంలో రైతు కూలీలతో కలిసి ఆ ఎమ్మెల్యే రుణమాఫీ సంబరం..!

మిర్యాలగూడ, మన సాక్షి :

తెలంగాణలో రైతు కూలీల రుణమాఫీ సంబరాలు కొనసాగుతున్నాయి. ఎక్కడ ఉన్నా కూడా రైతులు సంబరాలు జరుపుకుంటున్నారు. బోరు బావుల ద్వారా వరి నాట్లు వేస్తున్న రైతులు ఎమ్మెల్యేలు చూడగానే సంబరాలు జరుపుకున్నారు.

ఈ సంఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో శుక్రవారం చోటుచేసుకుంది. మిర్యాలగూడ నియోజకవర్గ ఎమ్మెల్యే భత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) నియోజకవర్గంలోని మాడుగులపల్లి మండలంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంలో కల్మెలపాలెం గ్రామంలో పంట పొలాల్లో రైతులు ఎమ్మెల్యే బిఎల్ఆర్ ను చూసి సంబరపడ్డారు.

దాంతో ఆయన పొలంలోకి దిగి ట్రాక్టర్ తో దున్ని రైతు కూలీలతో కలిసి నాట్లు వేశారు. రుణమాఫీ ఏ మేరకు జరిగిందని రైతులతో ముచ్చటించారు. వరి నాట్లలో కూడా రుణమాఫీ సంబరాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంటుందని ఆయన అన్నారు. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెద్ద పీఠ వస్తుందన్నారు.

ఇవి కూడా చదవండి : 

SRISHAILAM : శ్రీశైలంకు కృష్ణ, తుంగభద్ర నుంచి భారీ వరద.. గంట గంటకు పెరుగుతున్న నీటిమట్టం, వారం రోజులు కొనసాగితే..!

Srishailam : శ్రీశైలంలో 859 అడుగులకు చేరిన నీటిమట్టం.. కొనసాగుతున్న వరద.. LATEST UPDATE

Theft : 90కి పైగా దొంగతనాలు.. చోరీ డబ్బుతో షార్ట్ ఫిలిమ్స్..! 

మరిన్ని వార్తలు